నీ చెత్త ప్రయోగాలతో టీమ్‌ని నాశనం చేస్తున్నాం... రాహుల్ ద్రావిడ్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్...

First Published Dec 22, 2022, 9:59 AM IST

కుల్దీప్ యాదవ్... తొలి టెస్టులో బౌలింగ్‌లో 8 వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో 40 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన ప్లేయర్... అయినా అతనికి రెండో టెస్టులో చోటు దక్కలేదు. 12 ఏళ్ల తర్వాత జయ్‌దేవ్ ఉనద్కట్‌ని టెస్టు టీమ్‌లోకి తెచ్చేందుకు కుల్దీప్‌ని పక్కనబెట్టేసింది టీమిండియా మేనేజ్‌మెంట్...

Kuldeep Yadav

మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా 404 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పూజారా 90, శ్రేయాస్ అయ్యర్ 86 పరుగులతో రాణించగా రవిచంద్రన్ అశ్విన్‌, కుల్దీప్ యాదవ్ కలిసి 8వ వికెట్‌కి 92 పరుగుల అమూల్య భాగస్వామ్యం నెలకొల్పారు...

Kuldeep Yadav

బౌలింగ్‌లో వికెట్లు తీస్తున్నా బ్యాటుతో పెద్దగా పరుగులు చేయలేకపోవడంతో కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. అశ్విన్, అక్షర్ బాల్‌తోనే కాకుండా బ్యాటుతోనూ రాణిస్తుండడంతో వారికి వరుస అవకాశాలు దక్కుతున్నాయి...

kuldeep

తాను తుది జట్టులో ఉండాలంటే వికెట్లు తీస్తే సరిపోదు, బ్యాటింగ్ చేయాలని గ్రహించిన కుల్దీప్ యాదవ్... తొలి టెస్టులో 114 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేసి టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. అయితే రెండో టెస్టులో చోటు దక్కించుకోలేకపోయాడు కుల్దీప్...

‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ గెలిచిన ప్లేయర్‌ని పక్కనబెట్టడం నమ్మశక్యం కాకుండా ఉంది. ఇది దారుణం. చెప్పడానికి నాకు మంచి మాటలు రావడం లేదు, ఇంకా మాట్లాడితే బూతులు మాట్లాడుతానేమో. తొలి టెస్టులో 20 వికెట్లలో 8 వికెట్లు తీసిన బౌలర్‌ని పక్కనబెట్టేస్తారా?

ఇద్దరు స్పిన్నర్లకు తుది జట్టులో అవకాశం ఇచ్చినప్పుడు అక్షర్ పటేల్‌ని లేదా రవిచంద్రన్ అశ్విన్‌ని పక్కనబెట్టొచ్చు. 8 వికెట్లు తీసిన బౌలర్‌ని తీయడం మాత్రం అన్యాయం. పిచ్‌తో సంబంధం లేకుండా రాణించిన తర్వాత కూడా తుది జట్టులో చోటు దక్కకపోతే ప్లేయర్‌ ఎలా ఫీలవుతాడు? 

ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం పెంచి, వాళ్లు మరింత మెరుగ్గా రాణించేలా చేయడం టీమ్ మేనేజ్‌మెంట్ బాధ్యత. కానీ భారత జట్టు మాత్రం దీన్ని భిన్నంగా వ్యవహరిస్తోంది. అద్భుతంగా రాణించిన ప్లేయర్లను పక్కనబెట్టి, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. 

click me!