కొత్త టీమ్‌, కొత్త పొజిషన్... నేను వెయిటింగ్! ఐపీఎల్ 2023 మినీ వేలంపై మయాంక్ అగర్వాల్...

First Published Dec 21, 2022, 5:10 PM IST

టీమిండియాలోకి వచ్చి కొంత కాలమే అయినా ఆ తక్కువ టైమ్‌లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మయాంక్ అగర్వాల్... టెస్టుల్లో రెండు సూపర్ ఫాస్ట్ డబుల్ సెంచరీలతో బ్రాడ్‌మెన్ రికార్డునే బ్రేక్ చేసిన మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ రాకతో జట్టులో చోటు కోల్పోయాడు. అయితే వచ్చే ఐపీఎల్‌తో అన్ని లెక్కలు సరిచేస్తానని అంటున్నాడు మయాంక్...

కెఎల్ రాహుల్ హ్యాండ్ ఇవ్వడంతో సీజన్‌కో కెప్టెన్‌ని మార్చే పంజాబ్ కింగ్స్, గత సీజన్‌కి ముందు మయాంక్ అగర్వాల్‌ని కెప్టెన్‌గా నియమించింది. రాహుల్ మాదిరిగానే మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలో కూడా పంజాబ్ కింగ్స్.. ఆరో స్థానంలో నిలిచింది... కెఎల్ రాహుల్, 8 జట్లలో ఆరో స్థానంలో నిలబెడితే మయాంక్, కాస్త బెటర్‌గా 10 ఫ్రాంఛైజీల్లో 6వ స్థానంలో నిలబెట్టాడు... 

Image credit: PTI

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు మిగిలిన ప్లేయర్లందరినీ సాగనంపి మయాంక్ అగర్వాల్‌ని రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది పంజాబ్ కింగ్స్. భారీ ధరకు న్యాయం చేయలేకపోయిన మయాంక్, 13 మ్యాచుల్లో 196 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ప్రెషర్‌తో బ్యాటింగ్‌లోనూ ఫెయిల్ అయ్యాడు..

ఐపీఎల్ 2023 మినీ వేలంలో పాల్గొనబోతున్న మయాంక్ అగర్వాల్, తొలి సెట్‌లోనే వేలానికి రాబోతున్నాడు. మినీ వేలంలో పాల్గొంటున్న స్వదేశీ క్రికెటర్లలో భారీ ధర దక్కించుకునే సత్తా ఉన్న ప్లేయర్ మయాంక్ అగర్వాల్. మినీ వేలంలో మయాంక్ అగర్వాల్‌కి ఎంత లేదన్నా  రూ.10-12 కోట్లు పలకవచ్చని అంచనా...

‘ఐపీఎల్ ఫ్రాంఛైజీకి కెప్టెన్సీ చేయడం వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా. గేమ్‌లో డెప్త్  తెలిసి వచ్చింది, పరిస్థితులను భిన్నంగా ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకున్నా. ఇప్పుడు నాకు కెప్టెన్సీ ఒత్తిడి లేదు. కొత్త టీమ్‌లో కొత్త రోల్ పోషించడానికి వెయిట్ చేస్తున్నా..

నా అనుభవాన్ని సరిగ్గా వాడుకోవాలని ఫిక్స్ అయ్యా. కొత్త టీమ్‌ తరుపున ఆడే అవకాశం దొరికితే మళ్లీ కొత్తగా ప్రారంభించే అవకాశం దొరుకుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. బయటి వాళ్లు ఏమనుకుంటున్నారనే విషయాలను నేను పెద్దగా పట్టించుకోను...’ అంటూ కామెంట్ చేశాడు భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్...

ఐపీఎల్ 2023 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఆర్‌సీబీ, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి జట్లు మయాంక్ అగర్వాల్ కోసం పోటీపడే అవకాశం ఉంది. అలాగే ముంబై ఇండియన్స్ కూడా మయాంక్ కోసం బాగా ప్రయత్నించవచ్చు...

రూ.12 కోట్లకు రిటైన్ చేసుకుని, 2023 మినీ వేలానికి వదిలేసిన పంజాబ్ కింగ్స్ కూడా మయాంక్ అగర్వాల్ కోసం రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకూ పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. ఇంతకుముందు ఆర్‌సీబీ, ఢిల్లీ, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్లకి ఆడిన మయాంక్ అగర్వాల్, గత ఐదు సీజన్లలో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడాడు.. 

click me!