ఆ కారణంగానే ధోనీ టెస్టుల నుంచి త్వరగా తప్పుకున్నాడు... కోచ్ రవిశాస్త్రి కామెంట్...

First Published Sep 3, 2021, 5:25 PM IST

క్రికెట్ మాజీ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్ నుంచి గంభీర్ దాకా చాలామంది భారత క్రికెటర్లు పరిమిత ఓవర్ల క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా, టెస్టుల్లో కొనసాగాలనుకున్నారు. అయితే మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం వారికి రివర్స్‌లో ఆలోచించాడు. ముందుగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డే, టీ20ల్లో కొనసాగాడు...

తన కెరీర్‌లో 90 టెస్టులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, 2014 ఆస్ట్రేలియా టూర్ మధ్యలో టెస్టుల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకుని, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు...

టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆరేళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగిన మహేంద్ర సింగ్ ధోనీ, 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు తెలిపిన విషయం తెలిసిందే...

‘టీమిండియాకి ఎమ్మెస్ ధోనీ చాలా చాలా కీ ప్లేయర్. అతని సారథ్యంలో భారత జట్టు రెండు వరల్డ్‌కప్స్, మూడు ఐసీసీ ట్రోఫీలను గెలిచింది. ఐపీఎల్‌లోనూ అతనికి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది...

టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో కూడా మహేంద్ర సింగ్ ధోనీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. మరో 10 మ్యాచులు ఆడి ఉంటే, 100 టెస్టులు కూడా పూర్తిచేసుకునేవాడు...

అప్పటికీ టాప్ 3 ఫిట్ ప్లేయర్లలో ఒకడు. మరో 10 మ్యాచులు ఆడి ఉంటే, అతని కెరీర్ గణాంకాలు మరింత మెరుగయ్యేవి... అయితే, మాహీ మాత్రం అవన్నీ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే, ధోనీ నిర్ణయం సరైనదే అనిపిస్తోంది...

అందరు క్రికెటర్లు గణాంకాలు, ల్యాండ్ మార్క్స్ పెద్ద విషయం కావని అంటారు, కానీ కొద్దిమంది మాత్రమే వాటి గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు...

మాహీ నిర్ణయాన్ని మార్చకోమ్మని నేను ప్రయత్నించాను. అయితే అతను నిర్ణయం మార్చుకోడానికిఏ మాత్రం సిద్ధంగా లేన్నట్టు తెలిసింది. అతని నిర్ణయం నిస్వార్థమైనది, సాహసోపేతమైనది...

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పొజిషన్‌‌ను ఇంత ఈజీగా దొరికిపోవడం చూసి ఆశ్చర్యపోయా... అందుకే ఎమ్మెస్ ఎప్పుడూ అంచనాలకు అందని క్రికెటర్...

వికెట్ల ముందు, వికెట్ల వెనకాల అతని టెక్నిక్ అద్భుతంగా ఉంటుంది. యువకులకు నేనిచ్చే మొదటి సలహా ఒక్కటే... ఎప్పుడూ కూడా మహేంద్ర సింగ్ ధోనీని అనుసరించాలని ప్రయత్నించకండి... మీ సొంత ఆట ఆడండి..

కీపింగ్‌లో అతని వేగం జేబుదొంగల కంటే వేగంగా ఉంటుంది... మిగిలిన ఏ వికెట్ కీపర్ కూడా ఇంత వేగంగా ఉండలేరు. ఆటను చదవడంలో ధోనీని మించినవాళ్లు లేరు...

ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని మాహీ ఆ నిర్ణయం తీసుకున్నాడు. సచిన్ టెండూల్కర్, కపిల్‌దేవ్‌ల మాదిరిగానే మాహీ కూడా ఏ ఫార్మాట్‌లో అయినా రాణించగలడు... కానీ ఎక్కడ తన అవసరం ఎక్కువగా ఉందో మాహీ గుర్తించగలిగాడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి.

click me!