విరాట్ కోహ్లీని దాటేసిన రోహిత్ శర్మ... రెండేళ్లలోనే రికార్డు స్థాయిలో...

First Published Sep 2, 2021, 3:30 PM IST

భారత కెప్టెన్ కోహ్లీ కంటే ముందే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా... చాలా విషయంలో విరాట్‌ కంటే వెనకబడ్డాడు రోహిత్ శర్మ... మిగిలిన బ్యాట్స్‌మెన్‌ను పక్కకునెట్టి, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న విరాట్ కోహ్లీకి తొలిసారి చెక్ పెట్టాడు రోహిత్ శర్మ...

ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ టాప్ 5లోకి దూసుకెళ్లాడు. ఫలితంగా కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ టాప్5లో ఉన్న ఏకైక బ్యాట్స్‌మెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, ఆరో ర్యాంకుకి పడిపోయాడు...

ఇంగ్లాండ్‌తో జరుగుతన్న టెస్టు సిరీస్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్న విరాట్ కోహ్లీ, మూడో టెస్టు పర్పామెన్స్ తర్వాత 11 పాయింట్లు కోల్పోయి ఆరో ర్యాంకుకి పడిపోయాడు...

మూడో టెస్టులో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ, పాయింట్లు రాబట్టుకోలేకపోయినా, తన ఖాతాలో ఉన్న పాయంట్లను కాపాడుకోగలిగాడు. 773 పాయింట్లతో ఉన్న రోహిత్, విరాట్ కంటే 7 పాయింట్లు అధికంగా సాధించి టాప్ 5లోకి దూసుకుపోయాడు.

వన్డేల్లో రికార్డు స్థాయిలో డబుల్ సెంచరీలు బాదినా, టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదినా టెస్టుల్లో రోహిత్ శర్ సక్సెస్ కాడనే విమర్శలు వచ్చాయి... కెరీర్ ఆరంభంలో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్, ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చాక అద్భుతంగా రాణిస్తున్నాడు...

2017 సెప్టెంబర్‌ 1న టెస్టు బ్యాట్స్‌మెన ర్యాంకింగ్స్‌లో 52వ ర్యాంకులో ఉన్న రోహిత్ శర్మ, రెండేళ్ల తర్వాత  53వ ర్యాంకుకి పడిపోయాడు... అయితే ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతని ర్యాంకు పెరుగుతూ పోయింది...

2019 సెప్టెంబర్ 1న 53వ ర్యాంకులో ఉన్న రోహిత్ శర్మ, 2020లో 16వ ర్యాంకులోకి దూసుకొచ్చాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారీ సెంచరీతో చెలరేగిన రోహిత్ టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చాడు...

2021 సెప్టెంబర్ 1కి టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, భారత జట్టు తరుపున అత్యుత్తమ ర్యాంకు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...

టెస్టు సిరీస్‌లో 500+ పరుగులు సాధించిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లగా, కేన్ విలియంసన్ రెండో ర్యాంకుకి పడిపోయాడు.

టెస్టు ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని అధిగమించినా... వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మాత్రం భారత తరుపున అత్యుత్తమ ర్యాంకు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీయే...

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రిత్ బుమ్రా మళ్లీ టాప్ 10లోకి ఎంట్రీ ఇవ్వగా, రవిచంద్రన్ అశ్విన్ రెండో ర్యాంకులోనే కొనసాగుతున్నాడు...

భారత జట్టుపై అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న ఇంగ్లాండ్ సీనియర్ మోస్ట్ పేసర్ జేమ్స్ అండర్సన్, టాప్ 5లోకి దూసుకొచ్చాడు. ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ టాప్‌లో ఉన్నాడు..

click me!