INDvsENG 4th Test: టాస్ గెలిచిన ఇంగ్లాండ్... మళ్లీ ఆ స్టార్ ప్లేయర్‌కి నిరాశే...

First Published Sep 2, 2021, 3:11 PM IST

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. సిరీస్‌లో ఇప్పటిదాకా జరిగిన మొదటి మూడు మ్యాచుల్లో ఇరుజట్లూ చెరో విజయం సాధించి, సమంగా ఉండడంతో మిగిలిన రెండు మ్యాచులు కీలకం కానున్నాయి...

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మూడో టెస్టులో గాయపడడంతో అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగినా, మరోసారి అతనికి నిరాశే ఎదురైంది...

ఇషాంత్ శర్మ స్థానంలో ఉమేశ్ యాదవ్‌కి చోటు ఇచ్చిన విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కి తుదిజట్టులో చోటు కల్పించాడు...

ఇప్పటిదాకా ఈ స్టేడియంలో టీమిండియా 13 టెస్టు మ్యాచులు ఆడితే, ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. ఐదు మ్యాచుల్లో ఓడగా, ఏడు మ్యాచుల్లో ఓటమి పాలైంది...

1971 నుంచి గత 50 ఏళ్లలో ఇక్కడ జరిగిన 8 మ్యాచుల్లో ఐదు మ్యాచులను డ్రా చేసుకున్న టీమిండియా, మూడు మ్యాచుల్లో ఓడింది...

ఇప్పటిదాకా ది ఓవల్‌లో 79 మ్యాచులు జరగగా తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 38 సార్లు గెలిచాయి. తొలు బౌలింగ్ చేసిన జట్లకి 22 మ్యాచుల్లో విజయం దక్కింది. మిగిలిన 19 మ్యాచులు డ్రాగా ముగిశాయి.

ఇంగ్లాండ్ జట్టు: రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జోరూట్, ఓల్లీ పోప్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ ఆలీ, క్రిస్ వోక్స్, క్రెగ్ ఓవర్టన్, ఓల్లీ రాబిన్‌సన్, జేమ్స్ అండర్సన్

భారత జట్టు: రోహిత్ శర్, కెఎల్ రాహుల్, పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే,రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

click me!