Yashasvi Jaiswal: 92 ఏళ్లలో ఇదే తొలిసారి..! య‌శ‌స్వి జైస్వాల్ స‌రికొత్త చ‌రిత్ర !

First Published | Feb 25, 2024, 10:29 PM IST

Yashasvi Jaiswal: ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా యంగ్ ప్లేయ‌ర్, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ య‌శ‌స్వి జైస్వాల్ రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నాడు. ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ  92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును న‌మోదుచేశాడు. 
 

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal: టీమిండియా బ్యాట్స్‌మెన్ య‌శ‌స్వి జైస్వాల్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ రికార్డుల మోత మోగిస్తున్నాడు. భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో ఇప్ప‌టికే 600ల‌కు పైగా ప‌రుగులు చేశాడు. దీంతో ఒక టెస్ట్ సిరీస్‌లో 600+ పరుగులు చేసిన భారత  మొదటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు.

Yashasvi Jaiswal

ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ య‌శ‌స్వి జైస్వాల్ ఈ అరుదైన ఘనత సాధించాడు. రాంచీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా ప్ర‌స్తుం రాంచీ వేదిక‌గా 4వ టెస్టు జ‌రుగుతోంది.


yashasvi jaiswal.jp

ఇంగ్లాండ్ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో య‌శ‌స్వి జైస్వాల్‌ ఒక పరుగు సాధించి ఈ ఘనత సాధించాడు. ఈ టెస్టు సిరీస్‌లో జైస్వాల్ 55 పరుగులు చేసే సమయానికి 600 పరుగుల మార్కును దాటగలిగాడు.

yashasvi jaiswal 8.jp

టీమిండియా యువ టాలెంటెడ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ ఇప్పుడు ఒక‌ టెస్ట్ సిరీస్‌లో 600+ పరుగులు చేసిన 5వ భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

yashasvi jaiswal 7

అలాగే, ఈ 22 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ జైస్వాల్ ఇప్పుడు విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, దిలీప్ సర్దేశాయ్ వంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ల సరసన చేరాడు.

yashasvi jaiswal 3.jpg

టీమిండియా మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ టెస్టు సిరీస్‌లో రెండుసార్లు 600+ పరుగులు చేశారు.

క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రమే టెస్టు సిరీస్‌లో 700+ పరుగులు చేశాడు. టెస్టు సిరీస్‌లో సన్నీ రెండుసార్లు 700+ పరుగులు చేశాడు. ఇంకో మ్యాచ్ మిగిలివుంది కాబ‌ట్టి ఒక టెస్టు సిరీస్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డును కూడా య‌శ‌స్వి జైస్వాల్ అధిగ‌మించే అవ‌కాశ‌ముంది.

Latest Videos

click me!