Rohit Sharma: టెస్టు క్రికెట్ లో హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ మ‌రో రికార్డు.. !

Published : Feb 25, 2024, 09:36 PM IST

IND vs ENG - Rohit Sharma: టీమిండియా స్టార్ ప్లేయ‌ర్, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టెస్టు క్రికెట్ లో మ‌రో మైలురాయిని అందుకున్నాడు. 2013లో వెస్టిండీస్‌తో టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన రోహిత్.. 2022 నుంచి టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు.  

PREV
16
Rohit Sharma: టెస్టు క్రికెట్ లో హిట్‌మ్యాన్  రోహిత్ శ‌ర్మ మ‌రో రికార్డు.. !

Rohit Sharma: రాంచీ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన క్రికెట్ కెరీర్ లో మ‌రో మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో 20 ప‌రుగులు చేయ‌డంతో రోహిత్ టెస్ట్ క్రికెట్ లో 4000 పరుగుల మైలురాయిని అధిగమించి ఈ ఘనత సాధించిన 17వ భారత ఆటగాడిగా నిలిచాడు.

26
Rohit Sharma

రోహిత్ శ‌ర్మ తన 58వ టెస్టు మ్యాచ్ లో ఈ మైలురాయిని చేరుకుని భారత ఆటగాళ్లలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా నిలిచాడు. 2013లో టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రోహిత్ ప్రస్తుతం ఈ ఫార్మాట్లో 44కు పైగా సగటును కలిగి ఉన్నాడు.

36
Rohit Sharma, Siraj

టెస్టు క్రికెట్ ప్రారంభ కెరీర్ లో రోహిత్ శ‌ర్మ మిడిలార్డర్ బ్యాట్స్ మన్ గా ఉండ‌గా, 2019లో ఓపెనర్ గా మారాడు. అప్ప‌టి నుంచి టెస్టు క్రికెట్ లో భారత్ కు ప్రధాన ఓపెనర్ గా మారాడు.

46
Rohit Sharma-Yashasvi Jaiswal

2019లో దక్షిణాఫ్రికాపై చేసిన 212 పరుగులే రోహిత్  కెరీర్ లో అత్యధిక టెస్టు స్కోరు. ఇటీవల రాజ్ కోట్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో తన కెరీర్ లో మ‌రో సెంచ‌రీ కొట్టాడు. ఇంగ్లీష్ జట్టుపై తన మూడవ టెస్ట్ సెంచరీని సాధించాడు.

56
India vs England: 11 fours, 2 sixes.. Rohit Sharma hits century against England in Rajkot

రాంచీ టెస్టులో రోహిత్ 4000 పరుగుల మైలురాయిని దాటి టెస్టు క్రికెట్ లో ఇంగ్లాండ్ పై 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో రోహిత్ శ‌ర్మ‌ 1000 టెస్టు పరుగులు పూర్తి చేసిన తొలి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. 

 

66
Rohit Sharma

ఇంగ్లాండ్ తో ఆడిన 13 టెస్టు మ్యాచ్ ల‌లో 46.04 సగటుతో ప‌రుగులు సాధించాడు. ఇదిలావుండ‌గా, రాంచీ టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 40/0తో ఉండగా, ఇంగ్లండ్ పై విజయానికి మరో 152 పరుగులు కావాలి.

Read more Photos on
click me!

Recommended Stories