David Warner
David Warner injured: ఆస్ట్రేలియా డైనమిక్ ఓపెనర్, స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ కు గాయం అయింది. దీంతో ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ కు గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే, వార్నర్ గాయం కారణంగా రాబోయే క్రికెట్ సిరీస్ లలో కనిపించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
David Warner
మరీ ముఖ్యంగా వచ్చే నెలలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) ప్రారంభం కానుంది. ఈ మెగా లీగ్ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచ కప్ 2024 జరగనుంది. దీంతో ఈ మెగా టోర్నీలలో డేవిడ్ వార్నర్ ఆడుతాడా? లేదా అనేది చూడాలి.
కంగారు టీమ్ వర్గాలు ప్రస్తుతం పేర్కొంటున్న వివరాల ప్రకారం డేవిడ్ వార్నర్ గాయం నుంచి ఐపీఎల్ ప్రారంభ సమయం వరకు కోలుకునే అవకాశముంది. అలా జరగని క్రమంలో వార్నర్ ఐపీఎల్ ప్రారంభం మ్యాచ్ లలో ఆడకపోవచ్చు. కానీ, ఈ రెండు మెగా టోర్నీలకు అందుబాటులో ఉంటాడనీ, అప్పటివరకు పూర్తి కోలుకుంటాడని ఆస్ట్రేలియన్ క్రికెట్ పేర్కొంది.
David Warner
"వార్నర్‌కు పూర్తిగా కోలుకోవాల్సి ఉంటుంది. అతని గాయం ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌కు, రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతని లభ్యతను ప్రభావితం చేయదు" అని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
జూన్‌లో జరగనున్న T20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటానని ఇప్పటికే వార్నర్ ప్రకటించాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్, వన్డే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని డేవిడ్ వార్నర్ ప్రకటించాడు.
David Warner
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత క్రికెట్ లీగ్ మ్యాచ్ లలో కొనసాగుతానని పేర్కొన్నాడు. కాబట్టి ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ వంటి టోర్నీలలో మరి కొంత కాలం పాటు వార్నర్ భాయ్ ఆటను చూడవచ్చు. వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్న ఇటీవలి సమయంలో పరుగుల వరద పారిస్తుండటం విశేషం.