ఇక్కడితో అయిపోలేదు... టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక కాకపోవడంపై మహ్మద్ సిరాజ్ స్పందన...

First Published Sep 17, 2021, 1:54 PM IST

టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ప్రకటించిన భారత జట్టులో మహ్మద్ సిరాజ్‌కి చోటు దక్కలేదు. గత ఏడాది ఐపీఎల్ 2020 నుంచి బాల్‌తో అద్భుతంగా రాణిస్తున్న సిరాజ్‌కి చోటు దక్కకపోవడంపై కొందరు అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు...

లార్డ్స్ టెస్టులో 8 వికెట్లు తీసి, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా టూర్‌లో 14 వికెట్లు తీసి టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు...

‘విరాట్ భాయ్ సపోర్ట్ నేనెప్పటికీ మరిచిపోలేను. నా కెరీర్ సక్సెస్‌లో కోహ్లీకి క్రెడిట్ తప్పకుండా ఉంటుంది. అయితే సెలక్షన్ మన చేతుల్లో ఉండదు...

టీ20 వరల్డ్‌కప్ గెలవాలనేది నా కల. అయితే ఇక్కడితో కథ ముగిసిపోలేదు. వచ్చే ఏడాది కూడా టీ20 వరల్డ్‌కప్ ఉంది. నా జీవితంలో ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి...

భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడమే నా ప్రధాన ధ్యేయం... వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటూ ముందుకు సాగాలని అనుకుంటున్నా... 

మహ్మద్ షమీ భాయ్, ఇషాంత్ భాయ్, జస్ప్రిత్ భాయ్‌ల నుంచి ఎన్నో విలువైన విషయాలను నేర్చుకున్నా... వారి సపోర్ట్ వల్లే నా బౌలింగ్‌ మెరుగైంది... 

అయితే నా వరకూ విరాట్ కోహ్లీ లాంటి స్ఫూర్తిదాయకమైన లీడర్ నాయకత్వంలో ఆడడం ఎప్పుడూ గర్వంగా ఉంటుంది... ’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ సిరాజ్...

గత ఏడాది ఐపీఎల్ 2020 సీజన్‌లో బౌలింగ్‌లో అదరగొట్టిన మహ్మద్ సిరాజ్, ఆ పర్పామెన్స్ కారణంగానే ఆస్ట్రేలియా టూర్‌లో చోటు దక్కించుకున్నాడు... 

రెండో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చి, మూడో టెస్టులో బుమ్రాతో కలిసి ఓపెనింగ్ స్పెల్ వేసిన మహ్మద్ సిరాజ్... నాలుగో టెస్టులో బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించాడు...

గబ్బా టెస్టులో రెండో ఇన్నింగ్స్‌‌లో ఐదు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్... బ్రిస్బేన్ టెస్టులో ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసి, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

click me!