ధోనీ ఒక్క టీ20 వరల్డ్‌కప్ గెలిస్తే, ఐదు ఓడిపోయాడు... విరాట్ కోహ్లీ నిర్ణయం కరెక్ట్ కాదు...

First Published Sep 17, 2021, 12:07 PM IST

విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా తప్పుకుంటూ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు కరెక్ట్ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడని కోహ్లీ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, మరికొందరు విరాట్ తప్పుకోవడం కరెక్ట్ కాదని కామెంట్ చేస్తున్నారు...

బ్యాట్స్‌మెన్‌గా 2016 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఒంటరిపోరాటం చేసి, భారత జట్టు ఫైనల్ చేరడానికి కారణమైన విరాట్ కోహ్లీ, 2017లో ధోనీ నుంచి టీ20 కెప్టెన్సీ తీసుకున్నాడు...

టీ20 కెప్టెన్‌గా 2021 వరల్డ్‌కప్‌ విరాట్ కోహ్లీకి మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్‌. ఇప్పటిదాకా తన కెరీర్‌లో కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయాడు విరాట్. అయితే ఈ విషయంలో మరో రకమైన చర్చ మొదలైంది...

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా తన మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ 2007లో గెలిస్తే... ఆ తర్వాత 2009, 2010, 2012, 2014, 2016 టోర్నీల్లో మాహీ కెప్టెన్సీలోనే టీమిండియా బరిలో దిగినా... టైటిల్ సాధించలేకపోయింది...

మోస్ట్ సక్సెస్‌ఫుల్ భారత కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెస్ ధోనీ... ఆరు టోర్నీల్లో ఒకే ఒక్క టోర్నీ గెలిస్తేనే గ్రేట్ అంటే... విరాట్ కోహ్లీ అంత సమయం ఇవ్వాల్సిందని అంటున్నారు అతని ఫ్యాన్స్...

‘విరాట్ కోహ్లీ ముందుగా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని అనుకున్నా, కానీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని ఊహించలేదు. కోహ్లీ నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది...

విరాట్ కోహ్లీ చాలా గొప్ప కెప్టెన్. అతని సామర్థ్యం ఏంటో ఇప్పటికే క్రికెట్ ప్రపంచానికి అర్థమై ఉంటుంది. అయితే ఐసీసీ టోర్నీల్లో టైటిల్ గెలవలేదనే బాధతోనే విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనిపించింది...

నా వరకూ అతనికి ఐసీసీ టైటిల్ గెలిచేందుకు వచ్చిన అవకాశాలు తక్కువ. అతని కెప్టెన్సీలో చివరి టీ20 వరల్డ్‌కప్ ఇది. ఈ సారి టైటిల్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ, టీమిండియా టీ20 కెప్టెన్‌గానూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు కామెంట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...

click me!