ఆర్‌సీబీకి కూడా ఇదే ఆఖరి సీజన్... ఈసారి టైటిల్ వచ్చినా, రాకపోయినా విరాట్ కోహ్లీ...

First Published Sep 17, 2021, 1:08 PM IST

టీ20ల్లో కెప్టెన్‌గా అద్భుతమైన విజయాలు అందించినప్పటికీ, విరాట్ కోహ్లీపై విమర్శలు రావడానికి ప్రధాన కారణం ఐపీఎల్... ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా ఏ మాత్రం సరైన రికార్డు లేకపోవడమే...

2008 నుంచి ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. 14 సీజన్లుగా ఒకే టీమ్‌కి ఆడుతున్న ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీయే...

అయితే ఇప్పటికే టీమ్ లోగో మార్చినా, జెర్సీ రంగులు మార్చినా, స్పాన్సర్లనీ, కోచ్‌లను... ప్లేయర్లను మార్చినా ఆర్‌సీబీకి మాత్రం లక్ కలిసి రావడం లేదు...

2009లో ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత 2011, 2016 సీజన్లలో ఫైనల్‌కి అర్హత సాధించినా టైటిల్ మాత్రం గెలవలేకపోయింది...

కెప్టెన్‌గా 2013 సీజన్ నుంచి పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్న విరాట్ కోహ్లీ... ఆర్‌సీబీ తరుపున 131 మ్యాచులు ఆడాడు. ఇందులో 60 విజయాలు దక్కగా, 64 పరాజయాలు దక్కాయి...

2016 సీజన్‌లో బ్యాటింగ్‌తో అద్భుతంగా పోరాడి, నాలుగు సెంచరీలతో 900+ పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2017, 2019 సీజన్లలో ఆఖరి స్థానంలో నిలిచింది ఆర్‌సీబీ...

8 సీజన్లలో ఒక్క టైటిల్ గెలవలేకపోవడంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో రోహిత్ శర్మ ఐదు టైటిల్స్ గెలవడంతో అతనిపై ట్రోలింగ్ మరింతగా పెరిగింది...

ఈ ఏడాది విరాట్ కోహ్లీకి ఆర్‌సీబీ కెప్టెన్‌గా 9వ సీజన్. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కి కెప్టెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ కెప్టెన్‌గా కూడా తప్పుకోవాలని భావిస్తున్నాడట...

2021 సీజన్‌, విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా ఆఖరి సీజన్ అని టాక్ వినబడుతోంది. గత ఏడాది ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించినా, నాలుగో స్థానంతోనే సరిపెట్టుకున్న ఆర్సీబీ, 2021 లీగ్‌కి బ్రేక్ పడే సమయానికి మూడో స్థానంలో ఉంది...

వరుసగా నాలుగు విజయాలు అందుకుని జోరు మీదున్న ఆర్‌సీబీ, ఆ తర్వాత మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓడింది. దీంతో ఈసారి విరాట్ సేన టైటిల్ సాధిస్తుందా? అనేది అనుమానంగానే మారింది...

ఈ సారి టైటిల్ వచ్చినా, రాకపోయినా వచ్చే సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా కొనసాగేందుకు విరాట్ కోహ్లీ సుముఖంగా లేడని వార్తలు వస్తున్నాయి...

click me!