Hardik Pandya: ఇది కొత్త వెర్షన్.. అతడిని ఆపడం ఎవరి తరమూ కాదు.. గుజరాత్ సారథి పై సన్నీ కామెంట్స్

Published : Apr 23, 2022, 05:54 PM IST

TATA IPL 2022- KKR vs GT: గాయం నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధించడమే గాక ఐపీఎల్ లో ఫ్రాంచైజీ మారిన తర్వాత  గుజరాత్  టైటాన్స్ సారథి బ్యాటింగ్ లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

PREV
19
Hardik Pandya: ఇది కొత్త వెర్షన్..  అతడిని ఆపడం ఎవరి తరమూ కాదు.. గుజరాత్ సారథి పై సన్నీ కామెంట్స్

ఐపీఎల్ లో మునుపెన్నడూ లేనంతగా బ్యాటింగ్ లో ఇరగదీస్తున్న స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా  తన ఆటతీరుతో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు.  

29

ఈ సీజన్ లో  గుజరాత్ టైటాన్స్ ఏడు మ్యాచులాడగా.. పాండ్యా అందులో ఆరు ఇన్నింగ్స్ ఆడాడు.  ఇందులో ఏకంగా 295 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జోస్ బట్లర్ (491) తర్వాత ఉన్నాడు. 

39

పాండ్యా ప్రదర్శనపై భారత క్రికెట్ దిగ్గజం  సునీల్ గవాస్కర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిమానులు ఇప్పుడు కొత్త పాండ్యాను చూస్తున్నారని, బ్యాటర్ గా అతడు గతంలో కంటే మరింత నైపుణ్యత ప్రదర్శిస్తున్నాడని అన్నాడు. 

49

సన్నీ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ కు ముందు అతడు పెద్దగా క్రికెట్ ఆడలేదు. ఫిట్నెస్ కోల్పోయి టీమిండియా నుంచి కూడా ఉద్వాసనకు గురయ్యాడు. గాయం, ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న అతడి కెరీర్ ముగిసినట్టే అనే వార్తలు కూడా వచ్చాయి. 

59

కానీ ఇప్పుడు  పాండ్యాను చూస్తే ముచ్చటేస్తోంది. ముఖ్యంగా   అతడి బ్యాటింగ్ అద్భుతం. పవర్ ప్లే లో ఫీల్డింగ్ ఆంక్షలను  సరిగా ఉపయోగించుకుంటూ పరుగులు రాబడుతున్నాడు. ధోనిని పాండ్యా  తన మెంటార్ గా భావిస్తాడు. 

69

మనం గొప్ప వ్యక్తులతో సావాసం చేసేప్పుడు వారి నుంచి కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటాం. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ధోని వంటి ఆటగాడు పాండ్యా కు మెంటార్ గా ఉండటమనేది అతడికి చాలా వరకు లాభించింది. ధోని నుంచి అతడు సరైన పాఠాలు నేర్చుకుంటున్నాడు. 

79

ఇప్పుడు మనం చూస్తున్నది హార్ధిక్ కొత్త వెర్షన్.  నాకు తెలిసి అతడి కెరీర్ లో ఇది బెస్ట్ వెర్షన్ అని నేను భావిస్తున్నాను. ఈ సీజన్ లో పాండ్యా  బాగా ఆడుతున్నాడు. ముఖ్యంగా నెంబర్ 4 లో వచ్చి అతడు కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు.  

89

అది టీమిండియానా.. గుజరాత్ టైటాన్సా అనే విషయం పక్కనబెడితే నెంబరర్ 4లో హార్ధిక్  బాగా సూటవుతాడు.  అతడు బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు...’ అని చెప్పుకొచ్చాడు. 

99

ఇక ఈ సీజన్ లో గత ఆరు ఇన్నింగ్స్ లలో కలిపి పాండ్యా.. 295 పరుగులు చేశాడు. కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి స్టార్ ఆటగాళ్లను వెనక్కి నెడుతూ పాండ్యా ముందుకు సాగుతున్నాడు.  గత ఆరు ఇన్నింగ్స్ లలో పాండ్యా స్కోర్లు.. వరుసగా 33, 31, 27, 50, 87, 67 గా ఉన్నాయి.  

click me!

Recommended Stories