అక్కడ సెంచరీల మోత మోగిస్తున్న ఛతేశ్వర్ పూజారా... ఆ ఇద్దరి బ్యాటింగ్ చూడాలనుకుంటే...

Published : Apr 23, 2022, 04:53 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా... కౌంటీ ఛాంపియన్‌‌షిప్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. సుసెక్స్ తరుపున ఆడిన మొదటి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన పూజారా, రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ దాటేశాడు...

PREV
17
అక్కడ సెంచరీల మోత మోగిస్తున్న ఛతేశ్వర్ పూజారా... ఆ ఇద్దరి బ్యాటింగ్ చూడాలనుకుంటే...

డర్భీషేర్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు చేసి అవుటైన ఛతేశ్వర్ పూజారా... రెండో ఇన్నింగ్స్‌లో 387 బంతులాడి 23 ఫోర్లతో 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు... 

27

కెప్టెన్ టామ్ హేన్స్ 243 పరుగులతో రాణించడంతో పాటు ఛతేశ్వర్ పూజారా డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ కారణంగా సుసెక్స్, ఆ మ్యాచ్‌లో ఫాలోఆన్ ఆడినా డ్రా చేసుకోగలిగింది...
 

37

వోర్కేస్టర్‌షేర్‌ క్లబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి సెంచరీతో చెలరేగాడు ఛతేశ్వర్ పూజారా. తొలుత బ్యాటింగ్ చేసిన వోర్కేస్టర్‌షేర్ క్లబ్ 491 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆ జట్టు కెప్టెన్ బ్రెట్ డిఓలివెరియా 169 పరుగులు చేశాడు...

47

సుసెక్స్‌కి తొలి బంతికి షాక్ తగిలింది. అలెస్టర్ ఓర్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు జాక్ లీచ్. టామ్ షేన్స్ 26, టామ్ క్లార్క్ 44 పరుగులు చేసి అవుట్ కాగా పాక్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు...

57

దాయాది దేశాల బ్యాటర్లు ఛతేశ్వర్ పూజారా, మహ్మద్ రిజ్వాన్‌లు కలిసి బ్యాటింగ్ చేయాలని ఆశపడిన అభిమానులకు రెండు మ్యాచుల్లోనూ నిరాశే ఎదురైంది. రిజ్వాన్ మొదటి మ్యాచ్‌లో 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

67

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కుదురుకుపోయిన ఛతేశ్వర్ పూజారా... 206 బంతుల్లో 16 ఫోర్లతో 109 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
 

77
shan masood

డర్బీషేర్ తరుపున ఆడుతున్న పాక్ బ్యాటర్ షాన్ మసూద్, సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీ సాధించాడు. సుసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 239 పరుగులు చేసిన మసూద్, లిస్టర్‌షేర్ క్లబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 219 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

click me!

Recommended Stories