IPL 2022: రూటు మార్చిన హార్ధిక్ పాండ్యా... సీజన్‌లో మొట్టమొదటిసారిగా...

Published : Apr 23, 2022, 03:39 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దూసుకుపోతున్న జట్టు గుజరాత్ టైటాన్స్. హార్ధిక్ పాండ్యాని కెప్టెన్‌గా ఎంచుకోవడం నుంచి, శుబ్‌మన్ గిల్‌ని రూ.8 కోట్లకు కోనుగోలు చేయడం, వేలంలో ప్లేయర్లను కొనుగోలు చేసిన విధానం కూడా క్రికెట్ విశ్లేషకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది గుజరాత్ టైటాన్స్...

PREV
17
IPL 2022: రూటు మార్చిన హార్ధిక్ పాండ్యా... సీజన్‌లో మొట్టమొదటిసారిగా...

ఐపీఎల్ 2022 సీజన్ మొదలయ్యాక తన కెప్టెన్సీతో తిరుగులేని విజయాలతో గుజరాత్ టైటాన్స్... టేబుల్ టాపర్‌గా నిలుపుతున్నాడు హార్ధిక్ పాండ్యా. ఆశీష్ నెహ్రా కోచింగ్‌లో, గ్యారీ కిర్‌స్టన్ గైడెన్స్‌లో పాండ్యా టీమ్... వరుస విజయాలు అందుకుంటోంది..

27

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. 7 మ్యాచుల్లో 3 విజయాలు, 4 పరాజయాలు అందుకున్న కేకేఆర్‌కి నేటి మ్యాచ్‌లో విజయం కీలకం కానుంది...

37

టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా 34 మ్యాచులు జరగగా టాస్ గెలిచిన ప్రతీ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

47

ఈ సీజన్‌లో టాస్ గెలిచిన తర్వాత తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న మొదటి కెప్టెన్‌గా నిలిచాడు హార్ధిక్ పాండ్యా... 

57
Hardik Pandya

2018 సీజన్‌లో అత్యధిక 15 మ్యాచులు ముగిసిన తర్వాత టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోగా, 2022 సీజన్‌లో ఆ నిర్ణయం తీసుకోవడానికి ఏకంగా 34 మ్యాచులు పట్టింది. 

67

గాయం కారణంగా గత మ్యాచ్‌లో బరిలో దిగని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, నేటి మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. గత మ్యాచ్‌లో విఫలమైన విజయ్ శంకర్ స్థానంలో పాండ్యా జట్టులోకి వచ్చాడు...

77

వరుస పరాజయాలతో కేకేఆర్ జట్టు మూడు మార్పులు చేసింది. టిమ్ సౌథీ, సామ్ బిల్లింగ్స్‌తో పాటు రింకూ సింగ్‌కి తుదిజట్టులో చోటు కల్పించాడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్...

click me!

Recommended Stories