Harshal Patel: హ్యాట్రిక్ కోసం ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు సార్లు ట్రై చేసిన హర్షల్

First Published Sep 27, 2021, 3:39 PM IST

Ipl 2021 MI vs RCB: ముంబయి ఇండియన్స్ తో జరిగిన కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ ను గెలిపించిన బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ విజయానందంలో మునిగి తేలాడు. అయితే ఐపీఎల్ లో హ్యాట్రిక్ సాధించడానికి అతడు పడ్డ కష్టాన్ని పటేల్ మీడియాతో పంచుకున్నాడు. 

ముంబయితో మ్యాచ్ లో హ్యాట్రిక్ తో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు హర్షల్ పటేల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సహచరుల నుంచే గాక టీమ్ ఇండియా మాజీ ఆటగాళ్లు సైతం హర్షల్ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే ఈ హ్యాట్రిక్ సాధించడం వెనుక పడ్డ కష్టాన్ని పటేల్ వివరించాడు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. హ్యాట్రిక్ కోసం ఏకంగా ఆరు సార్లు ట్రై చేశానని వెల్లడించాడు. 

ఐపీఎల్ లో గతంలో తాను ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడినప్పుడు కూడా హ్యాట్రిక్ కోసం ప్రయత్నించానని పటేల్ చెప్పుకొచ్చాడు. 

Harshal Patel

పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేయడం తనకు ఇష్టమన్న హర్షల్.. తాను ఏ టీమ్ తరఫున ఆడినా ఆ జట్టుకు న్యాయం చేకూరుస్తానని అన్నాడు. 

తాను వేసే స్లో బంతులను  అంచనా వేయడంలో బ్యాట్స్మెన్ బోల్తా కొడతారని, ఆ విషయంలో తాను బెట్ కూడా కాస్తానని చెప్పాడు. 

చివరికి ఆదివారం నాటి మ్యాచ్ లో అతడి కల సాకారమైంది. 17వ ఓవర్ లో బౌలింగ్ కు దిగిన హర్షల్.. వరుస బంతుల్లో పాండ్యా, పొలార్డ్, చాహర్ లను పెవిలియన్ కు పంపి ముంబయిని కోలుకోలేని దెబ్బతీశాడు. 

తాజా ప్రదర్శనతో ఐపీఎల్ పర్పుల్ క్యాప్ రేసులో  అగ్రస్థానం నిలబెట్టుకున్న హర్షల్.. ఆర్సీబీ తరఫున హ్యాట్రిక్ తీసిన మూడో బౌలర్ గా నిలిచాడు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో అతడు 23 వికెట్లు  పడగొట్టాడు. 

click me!