ఈ తరం నటులే గాక ఇండియా మాజీ క్రికెటర్ అజహరుద్ధీన్ కూడా బాలీవుడ్ నటి సంగీత బిలాంజిని పెళ్లి చేసుకున్నాడు. 1996లో వీరి వివాహం జరిగింది. 90వ దశకంలో సంగీత బాలీవుడ్ లో వెండితెర వేల్పుగా వెలుగొందింది. కానీ అజహర్ తో వివాహమయ్యాక ఆమె నటనకు దూరమైంది. మిథున్ చక్రవర్తితో కలిసి నటించిన నిర్భయ్.. ఆమె చివరి సినిమా. కాగా, 2010లో అజహర్ సంగీత వారి వివాహబంధాన్ని తెంచుకున్నారు.