ఇదే ఆఖరిది, వచ్చే సీజన్ ఆడను... ఐపీఎల్‌పై ఏబీ డివిల్లియర్స్ ప్రకటన...

First Published Aug 3, 2021, 10:53 AM IST

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా, మూడేళ్లుగా ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్. విరాట్ కోహ్లీకి ఆప్తమిత్రుడైన ఏబీ డివిల్లియర్స్, ఐపీఎల్ నుంచి కూడా తప్పుకోబోతున్నట్టు ప్రకటించాడు. 

విరాట్ కోహ్లీలోని కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కీలక సభ్యుడిగా ఉన్న ఏబీ డివిల్లియర్స్, ఎన్నో మ్యాచుల్లో ‘సూపర్ మ్యాన్’ ఇన్నింగ్స్‌లతో ఒంటి చేత్తో విజయాలను అందించాడు...

ఈ సీజన్‌లో జరిగిన మొదటి ఏడు మ్యాచుల్లోనూ రెండింట్లో ఏబీడీ సూపర్ షో కారణంగానే విజయాలను అందుకుంది ఆర్‌సీబీ...

అయితే ఈ సీజన్‌ తనకి ఆఖరిదని, వచ్చే సీజన్‌లో ఆడబోనని ప్రకటించి, ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేశాడు ఏబీ డివిల్లియర్స్...

‘అవును, కచ్ఛితంగా ఇదే నాకు ఆఖరి సీజన్. వచ్చే సీజన్‌లో ఆడడం లేదు. యూఏఈలో జరిగే ఫేజ్ 2 నాకు చివరి ఐపీఎల్ సీజన్...’ అంటూ ప్రకటించాడు ఏబీ డివిల్లియర్స్...

ఐపీఎల్ ఆరంభంలో డిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున ఆడిన ఏబీ డివిల్లియర్స్, నాలుగో సీజన్‌లో ఆర్‌సీబీకి మారాడు. అప్పటి నుంచి ఆర్‌సీబీలోనే కొనసాగుతున్నాడు ఏబీడీ...

ఐపీఎల్‌లో 176 మ్యాచులు ఆడిన ఏబీ డివిల్లియర్స్, ఆర్‌సీబీ తరుపున 150 మ్యాచులను పూర్తి చేసుకున్నాడు... కోహ్లీ తర్వాత ఆర్‌సీబీకి అత్యధిక మ్యాచులు ఆడిన ప్లేయర్ ఏబీడీయే...

ఐపీఎల్‌లో 38సార్లు నాటౌట్‌గా నిలిచిన ఏబీ డివిల్లియర్స్, 5056 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...

2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిల్లియర్స్, ఐపీఎల్‌కి ముందు కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్టుగా కనిపించాడు. 

అయితే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు, ఏబీ డివిల్లియర్స్‌తో జరిపిన చర్చలు సఫలం కాలేదు...

తన వల్ల ఓ యువకుడికి జట్టులో చోటు పోకూడదనే ఉద్దేశంతో ఏబీ డివిల్లియర్స్, తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే ఆలోచనను విరమించుకున్నాడు సఫారీ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

ఐపీఎల్ ఆడితే ఆర్‌సీబీ తరుపునే ఆడతానని, తన బెస్ట్ ఫ్రెండ్ విరాట్ కోహ్లీకి ఓ టైటిల్ అందించాలనే కోరిక మిగిలిపోయిందని చెప్పిన ఏబీ డివిల్లియర్స్, 37 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల లీగ్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఐపీఎల్ ద్వారా రూ.100 కోట్లు ఆర్జించబోతున్న మొట్టమొదటి విదేశీ ప్లేయర్‌గా ఏబీ డివిల్లియర్స్‌ రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ తరుపున ఏటా రూ.11 కోట్లు అందుకున్న ఏబీడీ... గత సీజన్ వరకూ ఆర్జించిన మొత్తం రూ.91.52 కోట్లు. ఈ ఏడాది రూ.100 కోట్ల క్లబ్‌లో చేరతాడు ఏబీడీ.

click me!