మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఓ భయంకర బౌన్సర్ వచ్చి, మయాంక్ అగర్వాల్ హెల్మెట్‌కు బలంగా తగిలింది. ఈ గాయం కారణంగా తీవ్రమైన నొప్పితో తల్లడిల్లిన మయాంక్ అగర్వాల్, ఫిజియో పర్యవేక్షణ తర్వాత చికిత్సకు వెళ్లాడు...
29
ఇప్పటికే శుబ్‌మన్ గిల్ గాయం కారణంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియాకి దూరమయ్యాడు. గిల్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను ఓపెనర్‌గా పంపాలని భావించింది బీసీసీఐ...
39
టెస్టు సిరీస్‌కి రెండు రోజుల ముందు మయాంక్ అగర్వాల్ గాయపడడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. కొన్నాళ్లుగా గాయంతో బాధపడుతున్న వైస్ కెప్టెన్ అజింకా రహానే గాయం నుంచి కోలుకున్నాడు.
49
‘నెట్ ప్రాక్టీస్‌లో మయాంక్ అగర్వాల్‌కి గాయమైంది. ఫిజియో టీమ్ అతన్ని పరీక్షిస్తోంది.. త్వరలోనే అతని ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ వస్తుంది...’ అంటూ తెలియచేశాడు అజింకా రహానే...
59
ఆగస్టు 4న ప్రారంభమయ్యే తొలి టెస్టు ప్రారంభమయ్యే సమయానికి మయాంక్ అగర్వాల్ కోలుకోకపోతే, కెఎల్ రాహుల్‌కి ఓపెనర్‌గా అవకాశం దక్కొచ్చు...
69
కౌంటీతో జరిగిన మ్యాచ్‌లో మిగిలిన ప్లేయర్లు విఫలమైన సమయంలో కెఎల్ రాహుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కాబట్టి అతను చాలా కాలం తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
79
కౌంటీతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి రాణించిన ఛతేశ్వర్ పూజారాను కూడా మయాంక్ స్థానంలో ఆడించే ప్రయత్నం చేయవచ్చని టాక్ వినబడుతోంది...
89
వన్‌డౌన్‌లో వచ్చే ఛతేశ్వర్ పూజారా రెండేళ్లుగా సెంచరీ చేయలేకపోయాడు. ఆస్ట్రేలియా టూర్‌లో ఆకట్టుకున్నా ఇంగ్లాండ్ సిరీస్‌లో, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఫెయిల్ అయ్యాడు...
99
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, పృథ్వీషా ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్‌లో ఉన్నారు. ఆగస్టు 3న లండన్‌కి పయనమయ్యే ఈ ఇద్దరూ, మూడో టెస్టు సమయానికి భారత జట్టుకి అందుబాటులోకి వస్తారు...