ఇది పిచ్చి నిర్ణయం, చరిత్రలో అతిపెద్ద తప్పిదం... ఇంగ్లాండ్ టూర్‌లో అతనికి అన్యాయం జరుగుతోందంటూ...

Published : Sep 02, 2021, 07:10 PM IST

రవిచంద్రన్ అశ్విన్ లాంటి టెస్టు ఆల్‌రౌండర్ అందుబాటలో ఉంటే, ఏ టీమ్ అయినా అతన్ని సాధ్యమైనంత ఎక్కువ మ్యాచుల్లో ఆడించాలని చూస్తుంది. ఫిట్‌గా ఉడి, మంచి ఫామ్‌లో ఉంటే అతనికి తుదిజట్టులో చోటు దక్కాల్సిందే. అయితే ఇంగ్లాండ్ టూర్‌లో కోహ్లీ ఆలోచన మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది...

PREV
111
ఇది పిచ్చి నిర్ణయం, చరిత్రలో అతిపెద్ద తప్పిదం... ఇంగ్లాండ్ టూర్‌లో అతనికి అన్యాయం జరుగుతోందంటూ...

నాలుగో టెస్టు జరుగుతున్న ది ఓవల్ గ్రౌండ్‌లో కౌంటీ మ్యాచ్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి, అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు...

211

టెస్టుల్లో అత్యంత వేగంగా 400 టెస్టు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇంగ్లాండ్ టూర్‌లో తుది జట్టులో ప్లేస్ కోసం ఆశగా ఎదురుచూడాల్సిన పరిస్థితుల్లో పడ్డాడు. అశ్విన్ లేకుండా భారత జట్టు వరుసగా నాలుగో టెస్టు ఆడుతోంది భారత జట్టు...

311

అశ్విన్‌కి టీమ్‌లో చోటు దక్కలేదని అడిగిన ప్రశ్నకు విరాట్ కోహ్లీ చెప్పిన సమాధానంపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది... ‘ఇంగ్లాండ్ టీమ్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఎక్కువగా ఉన్నారు. అందుకే జడ్డూ అయితే కరెక్ట్ అని ఆ నిర్ణయం తీసుకున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

411

వాస్తవానికి అత్యధిక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్లను అవుట్ చేసిన టాప్ బౌలర్‌గా క్రికెట్ దిగ్గజాలనే అధిగమించాడు రవిచంద్రన్ అశ్విన్. అశ్విన్‌కి టెస్టుల్లో 200+ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ వికెట్లు ఉన్నాయి...

511

800 టెస్టు వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ కూడా తన కెరీర్‌లో 191 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ని మాత్రమే అవుట్ చేశాడు. జేమ్స్ అండర్సన కూడా 190 మంది ఎడమచేతి బ్యాట్స్‌మెన్‌నే పెవిలియన్ చేర్చాడు..

611

లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌పై ఘనమైన రికార్డు ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనబెట్టి, జడేజాని ఆడించడం ఓ పిచ్చి నిర్ణయమని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

711

విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్ కూడా తీవ్రంగా విమర్శించాడు. ‘యూకేలో నాలుగు టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్‌ని ఎంపిక చేయకపోవడం, అతి పెద్ద తప్పిదంగా చరిత్రలో నిలిచిపోతుంది. 413 టెస్టు సెంచరీలు, ఐదు సెంచరీలు... ఇదో పిచ్చి...’ అంటూ ట్వీట్ చేశాడు వాగన్...

811

జడ్డూ మీద ఇష్టంతోనో, లేక అశ్విన్ మీద కోపంతోనే విరాట్ కోహ్లీ ఇలా అతన్ని పక్కనబెడుతున్నాడని... ఇంగ్లాండ్ టూర్‌లో రవిచంద్రన్ అశ్విన్‌‌కి అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు క్రికెట్ ఫ్యాన్స్..

911

ఇక మిగిలింది ఒకే టెస్టు. ఆ టెస్టులో అశ్విన్‌ని ఆడించినా, ఆడించకపోయినా పెద్దగా ఫలితం ఉండదని విరాట్ కామెంట్ చేయొచ్చని... టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్న అశ్విన్‌ని చూసి, కోహ్లీ కుళ్లుకుంటూ ఉండొచ్చని ట్రోల్స్ చేస్తున్నారు అభిమానులు...

1011

విరాట్ కోహ్లీ గైర్హజరీలో అజింకా రహానే, రవిచంద్రన్ అశ్విన్‌ని అద్భుతంగా వినియోగించుకుని, అద్భుత ఫలితాలు రాబట్టాడు. స్టీవ్ స్మిత్ లాంటి ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను త్వరగా పెవిలియన్ చేర్చడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు అశ్విన్...

1111

విరాట్ కోహ్లీ మాత్రం రవిచంద్రన్ అశ్విన్‌లాంటి ప్రధాన స్పిన్నర్‌ని పక్కనబెట్టి... జో రూట్ పరుగుల వరద పారించడానికి కారణమవుతున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

click me!

Recommended Stories