INDvsENG 4th Test: టాపార్డర్ మళ్లీ ఫెయిల్... ప్లాన్ మార్చిన విరాట్ కోహ్లీ, రహానే స్థానంలో జడ్డూ..

First Published Sep 2, 2021, 5:44 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా... లంచ్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది... నాలుగో టెస్టు తొలి సెషన్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు, భారత బ్యాట్స్‌మెన్‌పై పూర్తి ఆధిక్యం కనబర్చారు...

టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన టీమండియాకి క్రిస్ వోక్స్ తన మొదటి ఓవర్‌లోనే ఊహించని షాక్ ఇచ్చాడు. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి తొలి వికెట్‌కి 28 పరుగులు జోడించి, శుభారంభం దిశగా సాగుతున్న దశలో తొలి వికెట్ కోల్పోయింది భారత్...

27 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన రోహిత్ శర్మ, క్రిస్ వోక్స్ బౌలంగ్‌లో వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11 పరుగులు వద్ద అవుటైన రోహిత్ శర్మ, 15 వేల పరుగులకి 11 పరుగుల దూరంలో నిలిచాడు. 

396 ఇన్నింగ్స్‌ల్లో 14989 అంతర్జాతీయ పరుగులు చేసిన రోహిత్, మరో 11 పరుగులు చేస్తే 15 వేల మైలురాయిని అందుకుంటాడు.

కెఎల్ రాహుల్ 3 ఫోర్లు బాది, మంచి టచ్‌లో కనిపించాడు. 44 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ కూడా జట్టు స్కోరు 28 పరుగుల వద్దే అవుట్ అయ్యాడు... రాబిన్‌సన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు రాహుల్...

ఛతేశ్వర్ పూజారా 31 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులుచేసి... జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 39 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది టీమిండియా...

పూజారానే 11 సార్లు అవుట్ చేసిన జేమ్స్ అండర్సన్, ‘మోడ్రన్ వాల్’ను ఎక్కువసార్లు పెవిలియన్ చేర్చిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

స్వల్ప స్కోరుకే మూడు వికెట్లు కోల్పోవడంతో వ్యూహం మార్చింది భారత జట్టు. ఐదో స్థానంలో అజింకా రహానే స్థానంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కి వచ్చాడు...

జడ్డూకి ఐదో స్థానంలో ఫస్ట్ క్లాస్ క్రికెట‌లో 3 త్రిబుల్ సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు ఉన్నాయి. అజింకా రహానేకి కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆరో స్థానంలో 2 డబుల్ సెంచరీలు ఉన్నాయి.

ఈ వ్యూహం టీమిండియాకి ఎంత వరకూ కలిసొస్తుందనేదానిపైనే భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు ఆధారపడి ఉంది. లేదంటే మూడో టెస్టులోలాగే తొలి ఇన్నింగ్స్‌లో స్పల్ప స్కోరుకే ఆలౌట అయ్యి, మ్యాచ్ కోల్పోవాల్సి ఉంటుంది.

click me!