డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్‌కి ఆడడం ఇదే ఆఖరిసారి... డేల్ స్టెయిన్ షాకింగ్ కామెంట్...

Published : May 03, 2021, 04:10 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి, మరీ ముఖ్యంగా డేవిడ్ వార్నర్‌కి ఏ మాత్రం కలిసి రాలేదు. ఆరు మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచ్ విజయం సాధించిన ఆరెంజ్ ఆర్మీ, ఆ తర్వాత డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలిగించింది. ఆ తర్వాత జట్టులో నుంచి కూడా...

PREV
111
డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్‌కి ఆడడం ఇదే ఆఖరిసారి... డేల్ స్టెయిన్ షాకింగ్ కామెంట్...

కేన్ విలియంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌కి తుదిజట్టులో చోటు కూడా కరువైంది. డగౌట్‌లో కూర్చుని, ప్లేయర్లకు డ్రింక్స్, బ్యాట్స్‌ అందిస్తూ కనిపించాడు వార్నర్ భాయ్...

211

ఐదు సీజన్లలో ఒక టైటిల్‌తో పాటు మూడు సార్లు జట్టును ఫ్లేఆఫ్ చేర్చి... గత ఆరు సీజన్లలో జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉంటూ వస్తున్న డేవిడ్ వార్నర్‌ను ఘోరంగా అవమానించింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం.

311

ఈ సంఘటన తర్వాత డేవిడ్ వార్నర్, మళ్లీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడడం జరగకపోవచ్చని అంటున్నాడు సౌతాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్...

411

‘సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం నాకు చాలా వింతగా అనిపించింది. తనని కెప్టెన్సీ నుంచి తప్పుస్తున్నట్టు తెలిపిన సన్‌రైజర్స్ నిర్ణయాన్ని వార్నర్ ప్రశ్నించాడో లేదో నాకు తెలీదు...

511

జట్టు ఎంపిక విషయంలో తనకి ఫ్రీడమ్ లేదని డేవిడ్ వార్నర్ చేసిన కామెంట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌కి పెద్దగా నచ్చకపోయి ఉండొచ్చు. కానీ ఆ స్వాతంత్య్రం అతనికి ఉంది.

611

జట్టు ఓడిపోతే డేవిడ్ వార్నర్‌నే ప్రశ్నిస్తారని గుర్తించాలి. కనీసం తన టీమ్‌లో ఏ ప్లేయర్ ఉండాలనే స్వాతంత్ర్యం కూడా కెప్టెన్‌కి లేకపోతే ఎలా...

711

సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ తొలగించడం, ఆ తర్వాత అతన్ని తుదిజట్టులో నుంచే తీసేయడం చూస్తుంటే వెనకాల ఏదో జరుగుతోందని మాత్రం అర్థమైంది...

811

నాకు తెలిసి వచ్చే సీజన్‌లో డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడకపోవచ్చు. డేవిడ్ వార్నర్ టాలెంటెడ్ బ్యాట్స్‌మెన్‌ను జట్టులో నుంచి తప్పిస్తే, సన్‌రైజర్స్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అంటూ కామెంట్ చేశాడు డేల్ స్టెయిన్.

911

డేవిడ్ వార్నర్ లేకుండా ఆడిన మొదటి మ్యాచ్‌లోనే బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమై, 55 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

1011

డేవిడ్ వార్నర్ స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన మహ్మద్ నబీ, బ్యాటుతో పెద్దగా రాణించకపోగా తాను వేసిన ఒక ఒక్క ఓవర్‌లో 21 పరుగులు సమర్పించుకున్నాడు.

1111

వార్నర్ స్థానంలో తుది జట్టులోకి తీసుకువచ్చి, మహ్మద్ నబీకి రెండో ఓవర్ కూడా ఇవ్వలేదంటే... డేవిడ్ స్థానంలో ఓ ఆల్‌రౌండర్‌ను తెచ్చామని చెప్పాలనే ఉద్దేశంతోనే జట్టులోకి తెచ్చినట్టు ఉందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు..

click me!

Recommended Stories