షాకింగ్: ఐపీఎల్ 2021 సీజన్‌ను వదలని కరోనా... చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ముగ్గురికి పాజిటివ్...

First Published May 3, 2021, 3:27 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌పై కరోనా ఎఫెక్ట్ భారీగానే పడేలా కనిపిస్తోంది. కేకేఆర్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌లో మరో ఇద్దరికి కరోనా సోకినట్టు సమాచారం.

చెన్నై సూపర్ కింగ్స్‌ సీఈవో కాశీ విశ్వనాథ్, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీతో పాటు సీఎస్‌కే బస్ క్లీనర్‌కి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది...
undefined
దీంతో వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు అందరికీ కరోనా పరీక్షలు చేయగా, అందరికీ నెగిటివ్ రిజల్ట్ వచ్చింది.
undefined
మొదట పాజిటివ్‌గా తేలిన కేకేఆర్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్... ప్రస్తుతం అహ్మదాబాద్‌లో మ్యాచులు ఆడుతున్న నాలుగు టీమ్‌ల్లో సభ్యులు కాగా సీఎస్‌కే ప్రస్తుతం ఢిల్లీలో మ్యాచులు ఆడుతోంది.
undefined
దీంతో ఒకేసారి రెండు చోట్ల కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్టు అయ్యింది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్, షెడ్యూల్ ప్రకారం బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది.
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకున్న సీఎస్‌కే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కరోనా కేసుల కలవరంతో ఐపీఎల్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
undefined
click me!