IPL 2021 సీజన్ మొత్తం వాయిదా పడనుందా... ఆర్‌సీబీ, కేకేఆర్ మ్యాచ్ వాయిదాతో అనుమానాలు...

First Published May 3, 2021, 3:09 PM IST

గత సీజన్‌లో యూఏఈలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఐపీఎల్ సీజన్‌ను విజయవంతంగా ముగించిన బీసీసీఐకి, ఈ సీజన్‌లో ఊహించిన షాక్ ఇచ్చింది కరోనా. ఫస్ట్ వేవ్‌లో వదిలేసిన అందర్నీ వెతికి మరీ పట్టుకున్నట్టుగా, ఐపీఎల్ 2021 సీజన్‌పై కూడా కరోనా కాటు పడింది...

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడింది.
undefined
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌లకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. ప్యాట్ కమ్మిన్స్ కూడా స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యాడు.
undefined
ఆరు నగరాల్లో కట్టుదిట్టమైన బయో బబుల్ జోన్ ఏర్పాటుచేసి, మ్యాచులను నిర్వహిస్తున్న బీసీసీఐకి ఈ సంఘటన ఒకింత షాక్‌క గురిచేసే అంశమే...
undefined
ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి పాకిస్తాన్ ఇలాగే పాక్ సూపర్ లీగ్‌ను ప్రారంభించింది. అయితే సరిగా 20 మ్యాచులు కూడా పూర్తికాకముందే ప్లేయర్లకు కరోనా పాజిటివ్ రావడంతో సీజన్‌ మొత్తాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది పాక్ క్రికెట్ బోర్డు.
undefined
ప్రస్తుతం బీసీసీఐ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం పాజిటివ్‌గా వచ్చిన వరుణ్ చక్రవర్తి కూడా ఆడాడు.
undefined
ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గత రాత్రి పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడింది. ఇలా ప్రస్తుతం అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు ఆడుతున్న పంజాబ్, ఆర్‌సీబీ, ఢిల్లీ, కేకేఆర్ ప్లేయర్లు అందరూ కరోనా రిస్క్ అంచున ఉన్నట్టే.
undefined
దీంతో ఆటగాళ్ల మధ్య కరోనా నియంత్రణకు ఎలా అడ్డుకుంటారనేది బీసీసీఐ ముందు సవాల్‌గా మారనుంది. బయో బబుల్‌లో ఉన్నా కరోనా ఎలా సోకిందనేది అనేక అనుమానాలకు తావిస్తున్న విషయం...
undefined
ఇప్పటికైతే ఇద్దరు ప్లేయర్లు మాత్రమే కరోనా పాజిటివ్ రావడంతో పరిస్థితి కాస్త అదుపులోనే ఉన్నట్టు భావించవచ్చు. అయితే ఈ సంఖ్య పెరిగితే మాత్రం ఐపీఎల్ 2021 సీజన్‌కు అర్ధాంతరంగా బ్రేకులు పడొచ్చు.
undefined
click me!