ఇది ఆరంభమే.. పిక్చర్ అబీ బాకీ హై.. భారత మహిళా క్రికెట్ జట్టు సారథి ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Jul 08, 2022, 01:41 PM IST

Harmanpreet Kaur: ఇద్దరు సీనియర్ ప్లేయర్లు లేకున్నా  ఆడిన తొలి విదేశీ సిరీస్ లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. అయితే ఇది ఆరంభం మాత్రమే అంటోంది  హర్మన్ ప్రీత్ కౌర్.

PREV
16
ఇది ఆరంభమే.. పిక్చర్ అబీ బాకీ హై.. భారత మహిళా క్రికెట్ జట్టు సారథి ఆసక్తికర వ్యాఖ్యలు

భారత మహిళా క్రికెట్ కు మూలస్తంభాలుగా ఉన్న ఇద్దరు సీనియర్ క్రికెటర్ల గైర్హాజరీలో భారత జట్టు శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించింది. ఇటీవలే టీమిండియా మాజీ సారథి మిథాలీ రాజ్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించగా.. జులన్ గోస్వామి ఈ సిరీస్ కు దూరంగా ఉంది. వీళ్లిద్దరూ లేకుండా విదేశీ సిరీస్ లో టీమిండియా మెరిసింది. 

26

కొత్త కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో  టీ20లలో భారత జట్టు 2-1 తేడాతో లంకను ఓడించింది. గురువారం ముగిసిన వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.  మ్యాచ్ అనంతరం ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

36

హర్మన్ ప్రీత్ మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్ మాకు  చాలా గొప్పగా గడిచింది. రెండు పార్మాట్లలో మేము అద్భుతంగా రాణించాం. మేం ఎప్పుడూ మా దృష్టిని ఆట నుంచి పక్కకు పోనియం. ఈ ప్రదర్శనలతో మేం హ్యాపీగా ఉన్నాం. 

46

లంకతో వన్డే సిరీస్ లో మేము ఎక్కువగా సింగిల్స్ పైనే దృష్టి సారించాం. ఎక్కువ సేపు క్రీజులో నిలవాలన్నది మా వ్యూహం. ఇక భారత మహిళా క్రికెట్ దిగ్గజాలైన మిథాలీ రాజ్, జులన్ గోస్వామి లేకుండా మేం తొలిసారి సిరీస్ ఆడుతున్నాం.

56

ఇది ఆరంభం మాత్రమే. మేమింకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. టీ20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ లో కూడా మేం అద్భుతంగా రాణించాం. మేం మా ఆటను ఎంజాయ్ చేశాం..’ అని తెలిపింది. 

66

లంకతో సిరీస్ ముగిసిన నేపథ్యంలో భారత జట్టు యూకేకు బయల్దేరనుంది. అక్కడ ఈ నెల మూడో వారం నుంచి మొదలుకాబోయే కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొంటుంది. బర్మింగ్హోమ్ వేదికగా జరుగబోయే కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ ను ఆడించడం ఇదే తొలిసారి. ఈ క్రీడల్లో ఎలాగైనా స్వర్ణం నెగ్గాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతున్నది. 

click me!

Recommended Stories