అటిట్యూడ్ కే అమ్మా మొగుడక్కడ.. జట్టులోంచి తీసేసినా దూకుడు తగ్గించుకోలే.. దాదాతో కథ వేరుంటది మరి..

Published : Jul 08, 2022, 01:02 PM IST

Sourav Ganguly: ఒకప్పుడు ప్రత్యర్థులు మనను స్లెడ్జింగ్ చేసినా ‘మనను కాదులే..’ అని చూసీచూడకుండా వెళ్లిన టీమిండియాలో దాదా సారథిగా వచ్చాక పరిస్థితులు మారాయి. ‘నువ్వెంత అంటే నువ్వెంత..’ అని ఎదురుతిరిగింది టీమిండియా.ఆట లోనే కాదు.. గ్రౌండ్ లో కూడా ’మాటకు మాట.. దెబ్బకు దెబ్బ..’ అనే సూత్రాన్ని ఒంటబట్టించుకుంది. 

PREV
18
అటిట్యూడ్ కే అమ్మా మొగుడక్కడ.. జట్టులోంచి తీసేసినా దూకుడు తగ్గించుకోలే.. దాదాతో కథ వేరుంటది మరి..

భారత క్రికెట్ దశ దిశను మార్చిన నాయకుల్లో అగ్రస్థానంలో ఉండే జాబితాలో టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ పేరు కూడా ఉంటుంది. కెప్టెన్ గా అతడు సాధించింది తక్కువేమీ కాదు. అసలు టీమిండియాకు దూకుడు నేర్పిందే దాదా. 

28

భారత జట్టులో దాదా శకం (2000 లలో కెప్టెన్సీ) ప్రారంభం కాకముందు టీమిండియాకు దూకుడుగా వ్యవహరించడం పెద్దగా అలవాటు లేదు. బ్యాటింగ్, బౌలింగ్ లలోనే కాదు.. గ్రౌండ్ లో కూడా ’మాటకు మాట.. దెబ్బకు దెబ్బ..’ అనే సూత్రాన్ని మనం ఒంటబట్టించుకోలేదనే చెప్పొచ్చు. ప్రత్యర్థి ఆటగాళ్లు మనను స్లెడ్జ్ చేసినా ‘ఎవరి పాపాన వాళ్లే పోతార్లే..’ అనుకునేవాళ్లు మన ఆటగాళ్లు. 

38
=

కానీ దాదా వచ్చాక ఆ పరిస్థితులు మారాయి. ‘నువ్వెంత అంటే నువ్వెంత..’ అని ఎదురుతిరిగింది టీమిండియా. సంప్రదాయక వినమ్రతపూర్వక అటిట్యూడ్ ను పక్కకునెట్టి కాలానికి అనుగుణంగా మారింది.  ఆటలోనే కాదు.. గ్రౌండ్ లో ఎవరైనా ప్రత్యర్థి నోటి దూలెక్కి ఏదైనా వాగితే అతడికి దీటుగా సమాధానం చెప్పడమే. 

48

అయితే దాదాకు ఈ దూకుడు కెప్టెన్ అయ్యాక వచ్చింది కాదు. అతడు తన కెరీర్ నుంచి ఇదే అటిట్యూడ్ తో ఉండేవాడు.  క్రికెట్ లో ఆధునిక కాలంలో విరాట్ కోహ్లి అగ్రెసివ్ గా ఉంటాడని.. ఫీల్డ్ లో అతడి అటిట్యూడ్ చూపిస్తాడని ఇప్పటికాలం యువత అనుకోవచ్చు గానీ.. భారత క్రికెట్ కు అగ్రెసివ్ ఆటను పరిచయం చేసిందే దాదా అనేది చరిత్ర చెప్పిన సత్యం. 
 

58

కెరీర్ ప్రారంభంలో దాదా ఓసారి ఈ అటిట్యూడ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయినా తాను మాత్రం క్యారెక్టర్ ను కోల్పోలేదు. అతడు తనలాగే ఉన్నాడు గానీ ఎవరి కోసం మారలేదు. 1992లో వెస్టిండీస్ టూర్ లో అరంగేట్రం చేసిన దాదా..  కెరీర్ ఆరంభంలోనే ఓ వివాదంలో చిక్కుకున్నాడు.

68

జట్టులోకి ఎంట్రీ ఇచ్చాక   తుది జట్టులో  మ్యాచ్ ఆడని సమయంలో రిజర్వ్ ఆటగాళ్లు.. ఫీల్డ్ లో ఉన్నవారికి డ్రింక్స్ ఇవ్వడం ఆనవాయితీ.  కానీ దాదా మాత్రం ‘ఆ పని నేను చేయను..’ అని కరాఖండీగా చెప్పేశాడట. తనకంటే సీనియర్ ప్లేయర్ అయినప్పటికీ అతడికి  డ్రింక్స్ మోసే బాధ్యత నాది కాదు అని అన్నాడని ఆరోపణలున్నాయి.  ఈ కారణంగా దాదాను తుది జట్టులోంచి కూడా తీసేశారు. 

78

అయితే అతడు మళ్లీ దేశవాళీలో మెరిసి తిరిగి  తనను జట్టులోకి పిలిపించుకునేంతలా చెలరేగాడే తప్ప ఎక్కడా ఎవరి ముందు చేయి చాచలేదు. ఆ దూకుడు వైఖరే దాదా తన కెరీర్ ఆసాంతం  కొనసాగించాడు. 
 

88

2002 నాట్వెస్ట్ ట్రోఫీలో లార్డ్స్ లో ఇంగ్లాండ్ పై చిరస్మరణీయ విజయం అందుకున్నాక షర్ట్ విడిచి దాదా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. కెప్టెన్ అయ్యాక దాదా.. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ధోని, సురేశ్ రైనా, గౌతం గంభీర్ వంటి యువ ఆటగాళ్లను ప్రోత్సహించాడు. వీళ్లంతా గతంలో మాదిరి ఏదన్న చెవులు మూసుకు వెళ్లే రకం కాదు.  మాటకు మాట.. దెబ్బకు దెబ్బ సమాధానం చెప్పేవారే. 
 

click me!

Recommended Stories