డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కి ‘ఐపీఎల్’ దెబ్బ... సీజన్ ఫ్లాప్! రైట్స్‌ పాయె, సబ్‌స్క్రైబర్లు పాయె...

Published : Jul 08, 2022, 01:19 PM ISTUpdated : Jul 08, 2022, 02:37 PM IST

ఐపీఎల్ 2023-27 మీడియా ప్రసార హక్కుల విక్రయం ద్వారా దాదాపు రూ.48 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది భారత క్రికెట్ బోర్డు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రీడా టోర్నీగా రెండో స్థానంలో నిలిచిన ఐపీఎల్ టీవీ రైట్స్‌ని దక్కించుకున్న డిస్నీ స్టార్, డిజిటల్ రైట్స్‌ని నిలబెట్టుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యింది...

PREV
19
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కి ‘ఐపీఎల్’ దెబ్బ... సీజన్ ఫ్లాప్! రైట్స్‌ పాయె, సబ్‌స్క్రైబర్లు పాయె...

ఇండియాలో ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులకు సంబంధించిన ప్యాకేజీ ఏని రూ.23,575 కోట్లు చెల్లించి దక్కించుకుంది డిస్నీ స్టార్. భారత ఉపఖండ దేశాల్లో 2023 నుంచి 2027 వరకూ ఐపీఎల్ టీవీ ప్రసారాలను చేయనుంది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్...

29

డిజిటల్ హక్కుల రేసులో అంబానీ రిలయెన్స్ సామ్రాజ్యానికా చెందిన వయాకామ్‌18 నిలవడంతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కి చుక్కెదురైంది. ఐదేళ్లుగా ఐపీఎల్‌ మ్యాచులను ప్రసారం చేస్తున్న హాట్ స్టార్‌లో వచ్చే ఐదేళ్లు లైవ్ ప్రసారాలు ఉండవు...

39

ఐపీఎల్ ప్యాకేజీ బీ, సీ హక్కులను దక్కించుకున్న వయాకామ్ 18, త్వరలో ఆన్‌లైన్ స్టీమింగ్ కోసం ఓ ప్రత్యేక యాప్‌ని తీసుకురానుంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లా ఓటీటీ యాప్‌ని తీసుకురాబోతున్న జియో, దాని మార్కెటింగ్‌కి ఐపీఎల్‌ను అస్త్రంగా వాడనుంది...

49
Image credit: PTI

అయితే ఐపీఎల్ ప్రసార హక్కులను కోల్పోయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెల రోజుల గ్యాప్‌లో 25 నుంచి 30 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను కోల్పోవడం విశేషం. హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారిలో చాలామంది ఐపీఎల్‌ మ్యాచులను చూసేందుకే ఈ యాప్‌ని ఉపయోగించేవాళ్లు...

59
IPL Trophy

ఇకపై ఐపీఎల్ మ్యాచులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రావడం లేదని తెలిసి, వీరిలో చాలామంది యాప్‌ని డిలీట్ చేసేశారు కూడా. దీంతో డిస్నీ స్టార్‌, రోజురోజుకీ  భారత్‌లో యూజర్లను కోల్పోతోంది...

69
Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్ సమయంలో 10 సెకన్ల యాడ్ కోసం రూ.17 లక్షలు ఖర్చు చేసింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. అలా ఒక్కో మ్యాచ్ యాడ్ కోసం రూ.39 కోట్ల ఖర్చు చేయాల్సి వచ్చింది. ఐపీఎల్ టీవీ ప్రసార హక్కుల కోసం రూ.57.5 కోట్లు చెల్లించిన డిస్నీ స్టార్, యాడ్స్ ద్వారా దాదాపు ఈ మొత్తాన్ని తిరిగి రాబట్టగలిగింది...

79
Image credit: PTI

అయితే ఐపీఎల్ 2022 సీజన్‌కి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలతో పాటు భారీ ఫాలోయింగ్ ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లాప్ కావడం కూడా సీజన్‌పై తీవ్రంగా ప్రభావం చూపించింది...
 

89

ఓవరాల్‌గా ఐపీఎల్ 2022 సీజన్‌కి అనుకున్నదాంట్లో 25 శాతం రెస్పాన్స్ మాత్రమే జనాల నుంచి రాబట్టగలిగింది బీసీసీఐ. ఫలితంగా ఐపీఎల్ మ్యాచుల్లో చాలా వరకూ రియల్ టైమ్ 1 మిలియన్ వ్యూస్ కూడా రాలేదు. రియల్ టైమ్ మిలియన్ల వ్యూస్ రాబట్టిన మ్యాచులు వేళ్ల మీదే లెక్కబెట్టొచ్చు...

99

అసలే ఐపీఎల్ డిజిటల్ రైట్స్‌ని కోల్పోవడం, ఆఖరి సీజన్ అట్టర్ ఫ్లాప్ కావడం... డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌పై తీవ్రంగా ప్రభావం చూపించాయట. దీంతో తిరిగి యూజర్లను ఆకర్షించేందుకు కొత్త మార్గాలు వెతుక్కుంటోందట హాట్ స్టార్...

click me!

Recommended Stories