ఇది కోహ్లీ బ్రాండ్ ఆఫ్ కెప్టెన్సీ... విరాట్‌పై మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్...

First Published Jan 13, 2022, 1:30 PM IST

టీమిండియాని టెస్టుల్లో ఐదేళ్లుగా నెం.1గా నిలిపిన ఘనత విరాట్ కోహ్లీకే దక్కుతుంది... ఐసీసీ టైటిల్స్ గెలవకపోయినా ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం విరాట్ సేనకి తిరుగే లేదు. సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవడమే లక్ష్యంగా సఫారీ గడ్డపై అడుగుపెట్టింది విరాట్ కోహ్లీ టీమ్...

సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా, జోహన్‌బర్గ్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఓడింది... 

జోహన్‌బర్గ్‌లో సౌతాఫ్రికా ముందు నాలుగో ఇన్నింగ్స్‌లో 240 పరుగుల లక్ష్యాన్ని ఉంచినా, దాన్ని కాపాడుకోలేకపోయింది భారత జట్టు...

సెంచూరియన్‌లో బరిలో దిగిన జట్టుతోనే రెండో టెస్టులో బరిలో దిగినప్పటికీ విరాట్ కోహ్లీ అగ్రెసివ్ కెప్టెన్సీని బాగా మిస్ అయిన టీమిండియా, ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టలేక ఓటమి పాలైంది...

కేప్‌ టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్టులో విరాట్ కోహ్లీ రాకతో టీమిండియాలో అతని దూకుడు కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 223 పరుగులకి ఆలౌట్ కాగా... సౌతాఫ్రికాను 210 పరుగులకి ఆలౌట్ చేసింది...

కేప్‌టౌన్‌లో టెస్టు ఎంట్రీ ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా 23.3 ఓవర్లలో 8 మెయిడిన్లతో 42 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు...

రెండో టెస్టులో జస్ప్రిత్ బుమ్రా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సౌతాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్‌ సెడ్జింగ్ చేశాడు. ఆ సమయంలో ఈ ఇద్దరి మధ్య వాతావరణం వేడెక్కి, ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు కూడా...

కరెక్టుగా మార్కో జాన్సెన్ క్రీజులోకి వచ్చినప్పుడు జస్ప్రిత్ బుమ్రాకి బంతిని అందించాడు విరాట్ కోహ్లీ. 26 బంతులాడి 7 పరుగులు చేసిన జాన్సెన్‌ని బుమ్రా క్లీన్‌ బౌల్డ్ చేశాడు...

మిగిలిన బ్యాట్స్‌మెన్‌కి సగటున 137 కి.మీ.ల వేగంతో బంతులు వేసిన జస్ప్రిత్ బుమ్రా... మార్కో జాన్సెన్‌కి మాత్రం 141.3 కి.మీ. వేగంతో బంతులు విసిరడం విశేషం...

‘జోహన్‌బర్గ్‌ టెస్టులో ఏం జరిగిందో విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌ నుంచి చూశాడు. అందుకే మార్కో జాన్సెన్‌ క్రీజులోకి రాగానే జస్ప్రిత్ బుమ్రాకి బాల్ అందించాడు... ఇదే విరాట్ కోహ్లీ బ్రాండ్ ఆఫ్ కెప్టెన్సీ... పక్కా బాక్సాఫీస్ క్రికెట్...’ అంటూ ట్వీట్ చేశాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.  

click me!