వీడు నన్ను చూసి నవ్వాడు, ఇప్పుడు ఎలా ఆడతాడో చూస్తా... విరాట్ కోహ్లీ కామెంట్...

First Published Aug 17, 2021, 10:27 AM IST

లార్డ్స్ టెస్టులో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. ఐదో రోజు ఆట ప్రారంభంలో టీమిండియాపై పెద్దగా అంచనాల్లేవు. అయితే ఐదో రోజు మొదటి సెషన్‌లో బ్యాటింగ్‌లో అదరగొట్టిన జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ... టీమిండియాకి భారీ స్కోరు అందించారు...

ఇంగ్లాండ్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్, ఓల్లీ రాబిన్‌సన్, సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ... 20 ఓవర్లకు పైగా బౌలింగ్ చేసి భారత టెయిలెండర్లను అవుట్ చేయలేకపోయారు. ఈ ఇద్దరూ 4+ రన్‌రేటుతో పరుగులు చేయడంతో టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది...

271 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు, 120 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత జట్టుకి 151 పరుగుల భారీ విజయం దక్కింది... రెండో సెషన్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌కి వచ్చినప్పటి నుంచి టీమిండియా అద్బుతమైన బౌలింగ్ కనబర్చింది...

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, భారత బౌలర్లను ఎంకరేజ్ చేసిన విధానం అద్భుతం. ఓల్లీ రాబిన్‌సన్ బ్యాటింగ్‌కి వచ్చిన సమయంలో కోహ్లీ చేసిన కామెంట్లు, స్టంప్ మైక్‌లో స్పష్టంగా వినిపించాయి...

‘వీడు నేను కవర్‌డ్రైవ్ మిస్ అయినప్పుడు, నన్ను చూసి నవ్వాడు. ఇప్పుడు వీడు ఎలా బ్యాటింగ్ చేస్తాడో చూస్తా... ప్రతీ టెస్టు మ్యాచ్‌లో వికెట్ కాపాడుకోవడానికి ఆడాల్సిందే...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

ఒకప్పుడు స్వదేశాల్లో ఘన విజయాలు అందుకున్నా, విదేశాల్లో ప్రత్యర్థి బౌలర్ల దూకుడు ముందు మన బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయేవాళ్లు. బౌలింగ్‌లోనూ అంతే. అయితే ఇప్పుడు టీమిండియాకి విరాట్ కోహ్లీ దూకుడు మంత్రం నేర్పించాడు...

గబ్బా టెస్టులో, తాజాగా లార్డ్స్ టెస్టులో విరాట్ కోహ్లీ నింపిన ఎనర్జీ స్పష్టంగా కనిపించింది. భారత ప్లేయర్ల దూకుడు ముందు ఇంగ్లాండ్ ప్లేయర్లు నిలవలేకపోవడం... టీమిండియా, విదేశాల్లో ఈ రేంజ్ డామినేషన్ చూపించడం... భారత క్రికెట్ ఫ్యాన్స్‌కి సంబరాలు తీసుకొచ్చింది...

103 బంతుల్లో 3 ఫోర్లతో 42 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని, తొలి ఇన్నింగ్స్‌లో ఓల్లీ రాబిన్‌సన్ అవుట్ చేశాడు. రాబిన్‌సన్ బౌలింగ్‌లో కోహ్లీ బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి, జో రూట్ చేతుల్లో వాలింది...

click me!