Ricky Ponting Praised Prithvi Shaw: ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆ జట్టు ఓపెనర్ పృథ్వీ షా పై ప్రశంసల వెల్లువ కురిపించాడు. భారత జట్టుకు అతడు త్వరలోనే కీలక ఆటగాడిగా మారతాడని అభిప్రాయపడ్డాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఈ సీజన్ లో తొలి రెండు మ్యాచులలో అనుకున్న స్థాయిలో రాణించకపోయినా తర్వాత మాత్రం ఇరగదీస్తున్నాడు. వరుసగా రెండు అర్థ సెంచరీలతో ఆకట్టుకుంటున్నాడు. అయితే తొలి రెండు మ్యాచులలో విఫలమైన షా ను హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వారం రోజుల క్రితం తన గదికి పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు.
28
అయితే వారం రోజుల క్రితం అతడితో పాంటింగ్ ఏం మాట్లాడో ఏమో గానీ అతడితో మీటింగ్ అనంతరం పృథ్వీ షా మాత్రం పూనకం వచ్చినోడిలా చెలరేగిపోతున్నాడు. లక్నో, కోల్కతా మ్యాచ్ లలో మెరుపు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డాడు.
38
ఈ నేపథ్యంలో పాంటింగ్.. షా పై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్ తరఫున అతడు వంద టెస్టులు ఆడతాడని, దేశం గర్వించదగ్గ ఆటగాడు అవుతాడని ప్రశంసల్లో ముంచెత్తాడు.
48
పాంటింగ్ మాట్లాడుతూ.. ‘నేను పృథ్వీ ఆటను చాలా రోజుల నుంచి దగ్గర్నుంచి గమనిస్తున్నాను. అతడిలో ఎంతో ప్రతిభ దాగి ఉంది. భవిష్యత్తులో అతడు టీమిండియా తరఫున కచ్చితంగా వంద టెస్టులు ఆడే ఆటగాడిగా నేను చూడాలనుకుంటున్నాను. అంతేగాక అతడి దేశం తరఫున వీలైనన్ని ఎక్కువ మ్యాచుల్లో అతడు ప్రాతినిథ్యం వహించాలని కోరుకుంటున్నాను...’ అని తెలిపాడు.
58
ఇదిలాఉండగా.. ఈ సీజన్ ప్రారంభంలో ముంబై తో జరిగిన తొలి మ్యాచులో 38 పరుగులు చేసిన పృథ్వీ షా.. తర్వాత గుజరాత్ పై 10 పరుగులుకే ఔటయ్యాడు. కానీ తర్వాత లక్నోపై 34 బంతుల్లోనే 61 పరుగులు చేయగా.. కోల్కతా తో మ్యాచులో కూడా 29 బంతుల్లోనే 51 రన్స్ చేశాడు.
68
మొత్తంగా ఈ సీజన్ లో షా ఆడిన నాలుగు మ్యాచుల్లో.. 160 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ లిస్ట్ లో దూసుకుపోతున్నాడు. పవర్ ప్లే లో హిట్టింగ్ కు దిగి ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఈ యువ ఓపెనర్.. ఇటీవల కోల్కతా తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి పవర్ ప్లే లో తక్కువ ఇన్నింగ్స్ (57 ఇన్నింగ్స్) వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
78
ఈ జాబితాలో కెఎల్ రాహుల్ (56 ఇన్నింగ్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇదే ఢిల్లీ తరఫునైతే వీరేంద్ర సెహ్వాగ్ (59 ఇన్నింగ్స్) ను అధిగమించాడు.
88
కాగా ఇప్పటివరకు ఈ యువ ఆటగాడు భారత్ తరఫున నాలుగు టెస్టులు ఆడాడు. ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసినా.. తర్వాత మాత్రం జట్టులో చోటు కోల్పోయాడు. నాలుగు టెస్టుల్లో 1 సెంచరీ 2 హాఫ్ సెంచరీలతో 339 పరుగులు సాధించాడు.