అలన్ బోర్డర్
ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్ 5వ స్థానంలో ఉన్నాడు. అతని కెప్టెన్సీలో అలెన్ బోర్డర్ వన్డే క్రికెట్ చరిత్రలో టాస్ ఓడిపోయి మొత్తం 48 మ్యాచ్‌లు గెలిచాడు. కాగా, అతని కెరీర్ మొత్తంలో బోర్డర్ చెప్పుకోదగిన సంఖ్యలో ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. వీటిలో 150 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మొదటి ఆటగాడు. టెస్టుల్లో 11,000 పరుగులు చేసిన తొలి ఆటగాడు. టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసిన మొదటి ఆటగాడు (150*,150 పరుగులు).
అలన్ బోర్డర్ టెస్టు క్రికెట్ లో 156 మ్యాచ్ లను ఆడాడు. 11174 పరుగులు సాధించాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 205 పరుగులు. 27 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక వన్డే క్రికెట్ లో 273 మ్యాచ్ లను ఆడి 6524 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 127 పరుగులు. అలన్ బోర్డర్ వన్డే క్రికెట్ లో 3 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు సాధించాడు.