ఐపీఎల్ 2025: అత్యంత ఖ‌రీదైన టాప్-10 రిటైన్ ప్లేయ‌ర్లు వీరే

First Published | Nov 1, 2024, 10:41 PM IST

IPL Expensive Retained Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలు 2025 సీజన్ కోసం తమ రిటైన్ ఆటగాళ్ల జాబితాను వెల్లడించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ అత్యంత ఖరీదైన రిటెన్షన్‌గా నిలిచాడు. అత‌న్ని రూ. 23 కోట్లకు SRH రిటైన్ చేసుకుంది. టాప్-10 ఖ‌రీదైన రిటెన్ష‌న్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 
 

Virat Kohli, Jasprit Bumrah

IPL Expensive Retained Players : 10. జస్ప్రీత్ బుమ్రా (MI)

ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ముంబై ఇండియన్స్ 18 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి మరో ముగ్గురు సీనియర్ ఆటగాళ్లను బుమ్రా కంటే తక్కువ ధర‌కే రిటైన్ చేసుకుంది ముంబై టీమ్. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ గా కొన‌సాగుతున్న బుమ్రా.. ఏ జట్టు కోసం ఆడినా గొప్ప ఫ‌లితాల‌ను అందిస్తాడు. గత ఐపీఎల్ సీజన్‌లో 20 వికెట్లు తీశాడు.

9. రుతురాజ్ గైక్వాడ్ (CSK)

చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను ఐపీఎల్ 2025 సీజ‌న్ కోసం 18 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. ఇది సీఎస్కేలో అత్యంత ఖరీదైన రిటెన్షన్. ఇత‌ను ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో సమానంగా అందుకున్నాడు. గైక్వాడ్ గత సీజన్‌లో తొలిసారి సీఎస్‌కే కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఆ జ‌ట్టు ప్లేఆఫ్‌కు చేరుకోవడంలో విఫలమైంది.

Ravindra Jadeja

8. రవీంద్ర జడేజా (CSK)

టీ20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ రవీంద్ర జడేజాను రూ.18 కోట్లకు సీఎస్‌కే రిటైన్ చేసుకుంది. IPL 2024లో జడేజా 160 స్ట్రైక్ రేట్‌తో 222 పరుగులు చేశాడు. అలాగే, 14 మ్యాచ్‌లలో 8 వికెట్లు తీసుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ సీఎస్కే జ‌డ్డూ పై న‌మ్మ‌కం పెట్టుకుంది.

7. ప్యాట్ కమిన్స్ (SRH)

ప్యాట్ కమ్మిన్స్ రిటెన్ష‌న్ లో అత‌ని ధ‌ర‌కు కోత ప‌డింది. ఐపీఎల్ 2024 వేలంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) అతన్ని రూ. 20.5 కోట్లకు కొనుగోలు చేసింది, కానీ ఇప్పుడు  ఐపీఎల్ 2025 కోసం రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. కమిన్స్ ఐపీఎల్ 2024 లో కెప్టెన్ గా ఉంటూ హైద‌రాబాద్ టీమ్ ను ఫైన‌ల్ కు న‌డిపించాడు. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి అడుగు దూరంలో టైటిల్ ను అందుకోలేక‌పోయింది. కెప్టెన్సీతో పాటు బౌలింగ్‌లో కూడా కమిన్స్ అద్భుత ప్రదర్శన చేసి 18 వికెట్లు పడగొట్టాడు.


Sanju Samson

6. రషీద్ ఖాన్ (GT)

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు బదులుగా రషీద్ ఖాన్‌కు టాప్ ప్లేస్ ఇస్తూ మొద‌టి రిటెన్ష‌న్ గా తీసుకుంది. ఐపీఎల్ 2025 కోసం రషీద్ రూ. 18 కోట్ల వేతనం అందుకోనున్నారు. రషీద్ ఖాన్ గ‌త సీజ‌న్ లో 12 మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు.

5. సంజు శాంసన్ (RR)

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను ఐపీఎల్ 2025 కోసం రూ. 18 కోట్లకు ఆ టీమ్ రిటైన్ చేసుకుంది. గత సీజన్‌తో పోలిస్తే అతడి వేతనం రూ.4 కోట్లు పెరిగింది. శాంసన్ గత సీజన్‌లో RR కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. 153 స్ట్రైక్ రేట్‌తో 531 పరుగులు చేశాడు. ఇందులో ఐదు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి.

Yashasvi Jaiswal

4. యశస్వి జైస్వాల్ (RR)

భార‌త యంగ్ ప్లేయ‌ర్ యశస్వి జైస్వాల్‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (RR) రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ వేలానికి ముందు ఆర్ఆర్ రిటైన్ చేసుకున్న అత్యంత ఖ‌రీదైన ప్లేయ‌ర్ గా జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ గత సీజన్‌లో 155 స్ట్రైక్ రేట్‌తో 435 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉంది. 

3. నికోలస్ పూరన్ (LSG)

లక్నో సూపర్‌జెయింట్‌లు కేఎల్ రాహుల్‌ను విడుదల చేసి వెస్టిండీస్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్‌ను రూ. 21 కోట్లకు రిటైన్ చేసుకుంది. IPL 2025 మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకున్న రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడు పూరన్. పురాన్ తదుపరి సీజన్‌లో ల‌క్నో టీమ్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. IPL 2024లో నికోల‌స్ పూర‌న్ 178 స్ట్రైక్ రేట్‌తో 499 పరుగులు చేశాడు.

2. విరాట్ కోహ్లీ (RCB)

ఐపీఎల్ లో అత్యధిక రన్-స్కోరర్ అయిన‌ విరాట్ కోహ్లీని ఐపీఎల్ 2025 కోసం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) 21 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. 2025లో ఆర్సీబీ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉంటార‌నే వార్త‌లు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి. ఎందుకంటే ఆ జ‌ట్టు గ‌త సీజ‌న్ లో కెప్టెన్ గా కొన‌సాగిన ఫాఫ్ డు ప్లెసిస్‌ని విడుదల చేసింది. ఐపీఎల్ 2024లో కోహ్లి ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.

1. హెన్రిచ్ క్లాసెన్ (SRH)

సన్‌రైజర్స్ హైద‌రాబాడ్ సౌతాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్‌ను రూ. 23 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇది ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అత్యంత ఖరీదైన రిటెన్షన్ గా నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ పవర్ హిట్ట‌ర్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోని అత్యంత విధ్వంసక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా గుర్తింపు సాధించాడు. ఐపీఎల్ 2024లో క్లాసెన్ 171 స్ట్రైక్ రేట్‌తో 479 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Latest Videos

click me!