వాళ్లు తినడానికి ఏమీ లేక, సమోసాలు తిని మ్యాచులు ఆడారు... హర్మన్‌ప్రీత్ కౌర్ అలా అంటుంటే...

Published : Apr 19, 2022, 04:53 PM IST

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డు బీసీసీఐ. భారత క్రికెట్ బోర్డు, ఐపీఎల్ ద్వారా ఆర్జించే సొమ్ముతో ఏకంగా ఓ పేద దేశాన్ని కొనేయొచ్చు. భారత పురుష క్రికెటర్లకు కోట్లు చెల్లిస్తున్న భారత క్రికెట్ బోర్డు, వారికి ఎలాంటి లోటు లేకుండా సకల సదుపాయాలు సమకూరుస్తోంది. అయితే మహిళా క్రికెటర్లు విషయంలో మాత్రం ఈ పరిస్థితి లేదు...

PREV
19
వాళ్లు తినడానికి ఏమీ లేక, సమోసాలు తిని మ్యాచులు ఆడారు... హర్మన్‌ప్రీత్ కౌర్ అలా అంటుంటే...

పురుష క్రికెట్‌తో పోలిస్తే మహిళా క్రికెట్‌కి క్రేజ్ తక్కువ. ఆ కారణంగా వుమెన్స్ క్రికెట్ ద్వారా వచ్చే ఆదాయం తక్కువే. పైపెచ్చు పురుష క్రికెట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని, మహిళా క్రికెటర్ల వేతనాలు, ఖర్చుల కోసం వాడుతోంది బీసీసీఐ...

29

2017 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన భారత జట్టు, రన్నరప్‌గా నిలిచింది. ఆ సమయంలో భారత జట్టు పడిన ఆకలి కష్టాల గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు బీసీసీఐ మాజీ ఛీఫ్ వినోద్ రాయ్...
 

39

‘నేను బీసీసీఐ ఛీఫ్‌గా ఉన్న సమయంలో కూడా వుమెన్స్‌ క్రికెట్‌కి సరైన ఫోకస్ పెట్టలేకపోయా. దానికి ఇప్పుడు బాధపడుతున్నా...

49

2017 వన్డే వరల్డ్ కప్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై హర్మన్‌ ప్రీత్ కౌర్ 171 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అప్పటి దాకా నేను వుమెన్స్ క్రికెట్‌ని పెద్దగా పట్టించలేదు...

59

ఆ మ్యాచ్‌ తర్వాత ‘సార్, నేను చాలా నీరసంగా ఉన్నా. పరుగెత్తడానికి శక్తి సరిపోలేదు, అందుకే సిక్సర్లు కొట్టాను... ’ అని హర్మన్‌ప్రీత్ నాతో చెప్పేవరకూ వారిపై ఎంత చిన్నచూపు చూపించానో అర్థం కాలేదు...

69

వారికి మ్యాచ్‌కి ముందు అందాల్సిన ఆహారం రాలేదు. దాంతో ఏం చేయాలో తెలియక బయట సమోసాలు కొనుక్కుని బ్రేక్ ఫాస్ట్ చేశారు...  ఆకలితోనే ఆడి గెలిచారు...

79

2006లో శరద్ పవార్, వుమెన్స్ క్రికెట్‌ని పురుషుల క్రికెట్ అసోసియేషన్‌తో కలిపే వరకూ ఎవ్వరూ వాళ్లని పట్టించుకోలేదు...

89

నిజం చెప్పాలంటే మెన్స్ క్రికెటర్ల కోసం కుట్టించిన యూనిఫామ్‌లను, వుమెన్ క్రికెటర్ల కోసం రీ స్టిచ్చింగ్ చేసేవాళ్లు... 

99

నేను, నైక్ కంపెనీకి అలా కాకుండా మహిళా క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కిట్స్ తయారుచేయాలని చెప్పాను. ఈ విషయంపై బీసీసీఐ దృష్టి పెట్టాలి... ’ అంటూ  చెప్పుకొచ్చాడు బీసీసీఐ మాజీ ఛీఫ్ వినోద్ రాయ్...

click me!

Recommended Stories