విరాట్ దగ్గరికి వస్తుంటే లోలోపల వణికిపోయా... సూర్యకుమార్ యాదవ్ కామెంట్స్...

Published : Apr 19, 2022, 03:43 PM IST

ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి వచ్చిన ప్లేయర్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు. టీమిండియాలోకి వచ్చినప్పటి నుంచి నిలకడైన ప్రదర్శన ఇస్తున్న ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్...  

PREV
17
విరాట్ దగ్గరికి వస్తుంటే లోలోపల వణికిపోయా... సూర్యకుమార్ యాదవ్ కామెంట్స్...

2020 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌ను సెడ్జ్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది... ఈ సంఘటనపై తాజాగా మాట్లాడాడు సూర్యకుమార్ యాదవ్...

27

‘సెడ్జింగ్ చేయడం విరాట్ కోహ్లీ స్టైయిల్‌.. ఆయన ఎనర్జీ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇరు జట్లకీ ఆ మ్యాచ్ చాలా కీలకం. ఆ మ్యాచ్‌లో విరాట్ సెడ్జింగ్ వేరే లెవెల్‌లో ఉంది...
 

37

నేను నా బ్యాటింగ్‌పైనే ఫోకస్ పెట్టా. విరాట్ దగ్గరికి వస్తుంటే... ‘బాస్, నువ్వు ఫోకస్ కోల్పోకు. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలి?’.. అనుకుంటూ ఉన్నా...

47

నేను కొట్టిన ఓ షాట్, విరాట్ చేతుల్లోకి వెళ్లింది. విరాట్ దగ్గరికి వస్తుంటే... ఆయన్నే చూస్తూ ఉండిపోయా. చూయింగ్ గమ్‌ నములుతూ బయటికి కూల్‌గా కనిపిస్తున్నా... నా హర్ట్‌బీట్ పెరిగిపోతూ ఉంది...

57

విరాట్ నా దగ్గరికి వస్తుంటే, చూస్తూ ఉండిపోయా. ఆయన ఏం మాట్లాడలేదు. నేను కూడా ఏం మాట్లాడలేదు. ఏం జరిగినా, ఏమీ అనకు... అని మనసులో అనుకుంటున్నా..

67

దాదాపు 10 సెకన్లు చూస్తూ ఉండిపోయా. ‘బాస్, దయచేసి ఏమీ అనకు...  ప్లీజ్’ అంటూ అనుకుంటూ ఉన్నా. ఆ ఓవర్ తర్వాత ఈ మ్యాచ్ ఎక్కువ సేపు ఉండదని నిర్ణయించుకున్నా.. 

77

మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ చాలా కూల్‌గా మాట్లాడి, బాగా ఆడావని మెచ్చుకున్నాడు... ’ అంటూ చెప్పుకొచ్చాడు ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. 

Read more Photos on
click me!

Recommended Stories