ఐపీఎల్‌లో కరోనా ఎఫెక్ట్... ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ వేదిక మార్పు...

Published : Apr 19, 2022, 03:05 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కలకలం రేగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15న ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫార్‌హర్ట్‌ పాజిటివ్‌గా తేలగా నిన్న (ఏప్రిల్ 18న) నిర్వహించిన పరీక్షల్లో ఆసీస్ ఆల్‌రౌండర్‌ మిచెల్ మార్ష్‌తో పాటు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది...

PREV
18
ఐపీఎల్‌లో కరోనా ఎఫెక్ట్... ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ వేదిక మార్పు...

మిచెల్ మార్ష్‌కి రెండో విడత చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చినా, ముందు జాగ్రత్తగా అతన్ని ఐసోలేషన్‌కి తరలించింది ఐపీఎల్ యాజమాన్యం. ఫిజియో ప్యాట్రిక్ ఫార్‌హర్డ్‌కి కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ కూడా ఆడింది...

28

దీంతో ఇరుజట్ల ప్లేయర్లకు మరో విడత కరోనా పరీక్షలు నిర్వహించిన ఐపీఎల్ యాజమాన్యం, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లందరినీ రెండు రోజుల పాటు క్వారంటైన్‌లో పెట్టింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 18న ముంబై నుంచి పూణే బయలుదేరి వెళ్లాల్సి ఉంది ఢిల్లీ క్యాపిటల్స్...

38

కరోనా కేసుల కారణంగా ఈ ప్రయాణం వాయిదా పడింది. ఢిల్లీ ప్లేయర్లు క్వారంటైన్‌లో ఉండడంతో షెడ్యూల్‌లో మార్పులు చేయకుండా పంజాబ్ కింగ్స్‌‌తో మ్యాచ్ వేదికను మారుస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
 

48

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్లు ముంబైలోనే ఉండబోతున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టు పూణే నుంచి నేవీ ముంబైకి రానుంది. ముంబైలోని బ్రాబోన్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. 

58
Mitchell Marsh

మిచెల్ మార్ష్‌తో పాటు మసాజర్ ఛేతర్ కుమార్, డాక్టర్ అభిజత్ సల్వీ, సోషల్ మీడియా మేనేజర్ ఆకాశ్ మానేలకు కరోనా పాజిటివ్‌గా తేలినట్టు నిర్ధారించింది ఐపీఎల్ యాజమాన్యం...

68

రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా 5 మ్యాచుల్లో 2 మ్యాచుల్లో గెలిచి, మూడింట్లో ఓడి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది...

78

అలాగే మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ ఆరు మ్యాచులు ఆడి 3 మ్యాచుల్లో గెలిచి, మూడింట్లో ఓడి... పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది...

88

ప్లేఆఫ్స్ చేరాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ మిగిలిన 9 మ్యాచుల్లో 6 మ్యాచుల్లో గెలవాల్సి ఉంటుంది. పంజాబ్ కింగ్స్ మిగిలిన 8 మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుతుంది...
 

click me!

Recommended Stories