కోహ్లీ సెంచరీ చేయగానే ఆసియా కప్ పరాజయాన్ని మరిచిపోయారు.. టీమిండియాపై రమీజ్ రాజా...

Published : Oct 06, 2022, 07:34 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన భారత జట్టు సూపర్ 4 రౌండ్ నుంచే నిష్కమించింది. పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో ఓడిన టీమిండియా, ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై టీ20 సిరీస్‌లు నెగ్గింది...

PREV
17
కోహ్లీ సెంచరీ చేయగానే ఆసియా కప్ పరాజయాన్ని మరిచిపోయారు.. టీమిండియాపై రమీజ్ రాజా...
Babar Azam

ఆసియా కప్ 2022 టోర్నీలో భారత్‌పై విజయం సాధించి ఫైనల్ చేరిన పాకిస్తాన్ జట్టు, టైటిల్ పోరులో పాకిస్తాన్ చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆసియా కప్ తర్వాత ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ని 3-4 తేడాతో ఓడింది పాకిస్తాన్...

27
Babar and Rizwan

ఆసియా కప్ 2022 టోర్నీలో ఫెయిల్ అయిన బాబర్ ఆజమ్, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సూపర్ పర్ఫామెన్స్ చూపించాడు. ఓ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌కి భారీ విజయం అందించాడు...

37

వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ కూడా ఈ టీ20 సిరీస్‌లో 316 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచి, ఐసీసీ నెం.1 బ్యాటర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో బాబర్ ఆజమ్ 7 మ్యాచుల్లో 285 పరుగులు చేసి రిజ్వాన్ తర్వాతి ప్లేస్‌లో ఉన్నాడు.

47
Babar Azam and Mohammad Rizwan

‘ఆసియా కప్‌లో ఇంతకుముందు మనం ఆరంభ రౌండ్లలోనే ఓడిపోయేవాళ్లం. ఈసారి ఫైనల్‌కి వెళ్లాం. అయితే లాస్ట్ మ్యాచ్‌లో బాగా ఆడలేకపోయాం. అయితే అప్పుడప్పుడూ ఇలాంటివి సహజం. ఆసియా కప్‌లో మనతో పాటు వేరే టీమ్స్‌ కూడా ఆడాయి..

57
Image credit: Getty

ఇండియా గురించే తీసుకోండి. వాళ్లు ఫైనల్ కూడా చేరలేకపోయారు. రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిపోయారు. రెండు మ్యాచుల్లో ఓడగానే ఫ్యాన్స్ గగ్గోలు పెట్టారు. ఫ్యాన్స్, మీడియా అంతా టీమిండియాపై విరుచుకుపడ్డారు...

67
Image credit: Getty

అయితే ఆఫ్ఘాన్‌పై విరాట్ కోహ్లీ సెంచరీ చేయగానే అంతా ఆసియా కప్ పరాజయాన్ని మరిచిపోయారు. మనం అలా చేయగలమా? బాబర్ ఆజమ్ సెంచరీ చేసినా... అతని స్ట్రైయిక్ రేటు బాగోలేదని, డేవిడ్ వార్నర్‌లా ఆడలేదని పోల్చి చూస్తాం... మనకీ, వాళ్లకీ ఉన్న తేడా అదే...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు పీసీబీ ఛైర్మెన్, పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా...

77
babar

ఇంగ్లాండ్ చేతుల్లో టీ20 సిరీస్ ఓడిన పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో కలిపి ఓ త్రైపాక్షిక సిరీస్ ఆడుతోంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముందు ప్రాక్టీస్‌గా ఈ టోర్నీఆడుతోంది పాకిస్తాన్...

Read more Photos on
click me!

Recommended Stories