కెప్టెన్సీ తీసుకుని తప్పు చేశా! ఆ మ్యాచులు ఓడిపోతే, నన్ను వేస్ట్ కెప్టెన్ అంటారు... - ప్యాట్ కమ్మిన్స్...

Published : Jan 29, 2023, 12:28 PM IST

టిమ్ పైన్ సెక్స్‌ఛాట్ వివాదంలో ఇరుక్కోవడంతో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు ఐసీసీ నెం.1 టెస్టు బౌలర్ ప్యాట్ కమ్మిన్స్... కమ్మిన్స్ కెప్టెన్సీలో యాషెస్ సిరీస్‌ని 4-0 తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా జట్టు... వరుస విజయాలతో ఐసీసీ నెం.1 టెస్టు టీమ్‌గా అవతరించింది...

PREV
18
కెప్టెన్సీ తీసుకుని తప్పు చేశా! ఆ మ్యాచులు ఓడిపోతే, నన్ను వేస్ట్ కెప్టెన్ అంటారు... - ప్యాట్ కమ్మిన్స్...
Pat Cummins with David Warner

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌కి అర్హత సాధించిన ఆస్ట్రేలియా, వచ్చే నెలలో ఇండియాలో పర్యటించనుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడనుంది ఆస్ట్రేలియా...

28
Pat Cummins

ఐపీఎల్ 2023 తర్వాత జూన్‌లో ఇంగ్లాండ్‌లో యాషెస్ సిరీస్ ఆడనుంది ఆస్ట్రేలియా. దీనికి ముందు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది. 2001లో చివరిగా ఇంగ్లాండ్‌లో యాషెస్ సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా, 2004లో ఆఖరిగా భారత్‌లో టెస్టు సిరీస్ గెలిచింది...

38
Cummins and Starc

‘నా కెప్టెన్సీ కెరీర్‌కి వచ్చే 10 టెస్టులు చాలా ముఖ్యమైనవి. ఇప్పటిదాకా నన్ను బెస్ట్ ఆస్ట్రేలియా కెప్టెన్ అని మెచ్చుకుంటూ వచ్చిన వాళ్లు, ఈ 10 టెస్టుల్లో రిజల్ట్ తేడా కొడితే వేస్ట్ కెప్టెన్ అనేస్తారు...

48

నిజానికి నేను కెప్టెన్సీ తీసుకోవడం సరైన నిర్ణయం కాదేమో. నా ఫిట్‌నెస్‌ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఇది కరెక్ట్ కాదు. నేను బౌలర్‌గా 100 శాతం ఇవ్వడంపైనే ఎక్కువ ఫోకస్ పెడతాను. ఆ తర్వాతే మిగిలిన విషయాలను పట్టించుకుంటాను...
 

58

బౌలింగ్ సరిగా లేకపోతే నా మూడ్ మొత్తం పాడవుతుంది. ఫీల్డ్ ప్లేస్‌మెంట్, మిగిలిన విషయాలను ఆలోచిస్తూ ఉంటే బౌలింగ్ సరిగ్గా వేయలేను. అందుకే కొన్ని స్పెల్స్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చేస్తున్నా. జరిగిన తప్పుని గ్రహించి, మళ్లీ కమ్‌బ్యాక్ ఇస్తున్నా..

68

స్టీవ్ వా, నా కెప్టెన్సీని తీవ్రంగా విమర్శించాడు. కెప్టెన్‌గా కాకుండా బౌలర్‌గా వెలిగిపోవాలని తిట్టాడు. నేను చేసే ఫీల్డింగ్ మార్పులను తప్పుబట్టాడు. బౌలర్లకు ఫీల్డర్లు ఎక్కడ ఉండాలో బాగా తెలుస్తుందని, అందులో నేను తలదూల్చడం కరెక్ట్ కాదని అన్నాడు...

78

బౌలర్లు కోరినట్టు ఫీల్డ్ పెట్టకపోతే వాళ్లకి కోపం వస్తుంది. అది సహజం. అందుకే చాలా విషయాలను పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నా. వాస్తవానికి నేను ఇప్పుడిప్పుడే కెప్టెన్సీ నేర్చుకుంటున్నా. వచ్చే 12 నెలలు నా కెరీర్‌కి చాలా ముఖ్యం...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా టెస్టు సారథి ప్యాట్ కమ్మిన్స్...

88

2021 డిసెంబర్‌లో బ్రిస్బేన్ టెస్టులో కెప్టెన్సీ చేపట్టిన ప్యాట్ కమ్మిన్స్, ఇప్పటిదాకా 13 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. 13 టెస్టుల్లో 8 విజయాలు అందుకున్న కమ్మిన్స్, ఓ మ్యాచ్ ఓడిపోయాడు. మిగిలిన నాలుగు మ్యాచులు డ్రాగా ముగిశాయి. ఇప్పటిదాకా కమ్మిన్స్ ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోలేదు..

click me!

Recommended Stories