కెప్టెన్లను మారుస్తున్నారు, ప్లేయర్లను మారుస్తున్నారు! పాక్ చేతుల్లో టీమిండియా ఓడడం ఖాయం.. - పాక్ మాజీ బౌలర్

Published : Aug 12, 2023, 06:37 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి ఇంకా రెండు నెలల సమయం ఉంది. అయితే ఇప్పటికే ఈ మ్యాచ్ గురించి పాక్ హడావుడి మొదలైపోయింది. ఈసారి గెలుపు మాదేనంటూ భారత జట్టుపై తీవ్రమైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు పాక్ మాజీ క్రికెటర్లు..  

PREV
17
కెప్టెన్లను మారుస్తున్నారు, ప్లేయర్లను మారుస్తున్నారు! పాక్ చేతుల్లో టీమిండియా ఓడడం ఖాయం.. - పాక్ మాజీ బౌలర్

ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో తలబడుతోంది టీమిండియా. సూపర్ 4 రౌండ్‌లో ఈ రెండు జట్లు మరోసారి సెప్టెంబర్ 10న మ్యాచ్ ఆడబోతున్నాయి. ఇండియా, పాక్ అంచనాలకు తగ్గట్టుగా ఆడితే ఫైనల్ మ్యాచ్‌లోనూ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూడొచ్చు..

27

ఈ మ్యాచ్‌లకు ముందు టీమిండియా చేస్తున్న వరుస ప్రయోగాలు, టీమ్ వాతావరణాన్ని పూర్తి దెబ్బ తీస్తున్నాయని... 2023 వన్డే వరల్డ్ కప్‌లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు పాకిస్తాన్ మాజీ పేసర్ సర్ఫరాజ్ నవాజ్..

37

‘ఆసియా కప్, వరల్డ్ కప్ టోర్నీలకు ముందు టీమిండియాతో పోలిస్తే పాకిస్తాన్ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా భారత జట్టు, ఈ మెగా టోర్నీలకు ఎవరిని ఆడించాలనే విషయంలో ఓ నిర్ణయానికి రానట్టుగా ఉంది...

47

కెప్టెన్లను మారుస్తున్నారు, చాలా మంది ప్లేయర్లను మారుస్తూ ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్లకు ఓ సరైన టీమ్ కాంబినేషన్ లేదు. చూస్తుంటే వాళ్లు టీమ్‌ని డెవలప్ చేయడానికి బదులుగా మంచిగా ఉన్న టీమ్‌ని చెడగొడుతున్నట్టే కనిపిస్తోంది..

57

అదీకాకుండా స్వదేశంలో వరల్డ్ కప్ మ్యాచ్ అంటే టీమిండియాపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అది పాకిస్తాన్‌కి హెల్ప్ అవుతుంది. అయితే సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్‌లో ఉండడం ఒక్కటే టీమిండియాకి ప్లస్ అయ్యే విషయం...

67

షాహీన్ ఆఫ్రిదీ అత్యద్భుత బౌలర్. అతను వేసే మొదటి రెండు, మూడు ఓవర్లు మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసేస్తాయి. అతనికి తన బౌలింగ్‌ స్వింగ్, సీమ్, పేస్‌, యార్కర్లపై పూర్తి కంట్రోల్ ఉంది. బంతిపై ఇంత పట్టు ఉన్న బౌలర్‌ని చాలా అరుదుగా చూస్తాం...

77

ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో పాకిస్తాన్ అదరగొడుతుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. బాబర్ ఆజమ్ అద్భుతంగా జట్టును నడిపిస్తున్నాడు. సెలక్షన్ కమిటీ కూడా అతనికి మంచి టీమ్‌ని ఇచ్చింది..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ సర్ఫరాజ్ నవాజ్.. 

click me!

Recommended Stories