ఐపీఎల్ 2023 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన రోహిత్ శర్మ, వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సెంచరీ బాదేశాడు. 2007లోనే అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్, 2011 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో రిటైర్ అయ్యేలోగా వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని గెలవాలని అనుకుంటున్నాడు రోహిత్...
2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్, 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ గెలిచాడు. ఇప్పుడు టీమిండియాలో యువీ లాంటి ప్లేయర్ లేకపోవడం అతి పెద్ద లోటు..
29
రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా వంటి ఆల్‌రౌండర్లు టీమ్‌లో ఉన్నా ఈ ఇద్దరి నుంచి యువరాజ్ సింగ్ రేంజ్ పర్ఫామెన్స్ ఆశించడం అత్యాశే అవుతుంది. తాజాగా 2023 వన్డే వరల్డ్ కప్ ముందు రోహిత్ టీమ్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు యువీ..
39
‘రోహిత్ శర్మ ప్రస్తుతం మంచి ఫామ్‌లో లేడు. కొన్నేళ్లుగా అతని బ్యాటు నుంచి రోహిత్ రేంజ్ ఇన్నింగ్స్ రాలేదు. అయితే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా, 2019 వరల్డ్ కప్ ముందు కూడా రోహిత్ సరైన ఫామ్‌లో లేడు..
49
2019 వన్డే వరల్డ్ కప్‌కి ముందు రోహిత్, నన్ను కలిశాడు. ఫామ్‌లో లేనందుకు ఫీలయ్యాడు. అప్పుడు ‘‘సంథింగ్ స్పెషల్ రాబోతోంది. నిరాశపడకుండా నీ జోన్‌లో ఉండమని చెప్పా..’’. ఆ వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ 5 సెంచరీలు బాదేశాడు..
59
rohit sharma record
ఇప్పుడు కూడా వరల్డ్ కప్ ముందు ఫామ్‌లో లేడు. ప్రపంచ కప్ కోసమే పరుగులన్నీ దాచిపెట్టుకుంటున్నట్టు ఉన్నాడు. ప్రతీదానికీ ఓ కారణం ఉంటుందని నమ్ముతా నేను. నా విషయంలోనూ ఇదే జరిగింది. సచిన్ టెండూల్కర్ కూడా నాతో ఇదే చెప్పారు. ఏం జరిగినా నిరాశ చెందవద్దని భరోసా ఇచ్చారు..’ అంటూ కామెంట్ చేశాడు యువరాజ్ సింగ్..
69
rohit sharma century
అయితే యువీ చెప్పనట్టు, ఐపీఎల్ 2019 సీజన్‌లో రోహిత్ ఫెయిల్ అవ్వలేదు. ఆ సీజన్‌లో 405 పరుగులు చేసిన రోహిత్ శర్మ, వన్ ఆఫ్ బెస్ట్ పర్ఫామెన్స్‌తో ముంబై ఇండియన్స్‌కి నాలుగో టైటిల్ అందించాడు..
79
Rohit Sharma century
వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో 5 సెంచరీలతో రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ 2003 వన్డే వరల్డ్ కప్‌లో చేసిన 673 పరుగుల రికార్డుకి 25 పరుగుల దూరంలో ఆగిపోయాడు...
89
Image credit: PTI
‘ధోనీ మంచి లీడర్, అయితే అతనికి మంచి టీమ్ దొరకడం వల్లే వరల్డ్ కప్స్ సాధించగలిగాడు. రోహిత్ కూడా మంచి లీడరే. అతని ఐపీఎల్ ట్రాక్ రికార్డు చూస్తే ఆ విషయం తెలుస్తుంది. అయితే వరల్డ్ కప్ గెలవాలంటే మంచి టీమ్ కూడా కావాలి...
99
Image credit: Getty
భారత జట్టుకి సరైన మిడిల్ ఆర్డర్ లేదు. ఓపెనర్లు త్వరగా అవుటైతే ఆడగల ప్లేయర్లు కనిపించడం లేదు. ఇలాంటి టీమ్‌తో వరల్డ్ కప్ గెలవడం చాలా కష్టమే..’ అంటూ యువరాజ్ సింగ్ ఇంతకుముందు చేసిన కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి..