టీమిండియా కోచ్‌ రేసులో మరో కొత్త పేరు.. ఐర్లాండ్ టూర్‌లో భారత జట్టు కోచ్‌గా సితాంశు కోటక్...

Published : Aug 12, 2023, 05:40 PM IST

టీమిండియా హెడ్ కోచ్ పొజిషన్ నుంచి రవిశాస్త్రి తప్పుకున్నాక భారత జట్టు పరిస్థితి, మ్యూజికల్ ఛైయిర్స్‌లా మారింది. ఒక్కో సిరీస్‌కి ఒక్కో ప్లేయర్‌గా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 2021 నుంచి ఇప్పటిదాకా టీమ్‌కి 9 మంది కెప్టెన్లు మారారు. త్వరలో హెడ్ కోచ్‌ల సంఖ్య కూడా పెరనుంది..

PREV
16
టీమిండియా కోచ్‌ రేసులో మరో కొత్త పేరు.. ఐర్లాండ్ టూర్‌లో భారత జట్టు కోచ్‌గా సితాంశు కోటక్...

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, రెస్ట్ కోరుకున్న సమయంలో తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తూ వచ్చాడు. అయితే ఐర్లాండ్ టూర్‌లో జరిగే మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కి సితాంశు కోటక్, హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నట్టు సమాచారం..
 

26

సౌరాష్ట్రకి చెందిన సితాంశు కోటక్, ప్రస్తుతం భారత A జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐర్లాండ్ టూర్‌లో భారత జట్టుకి వీవీఎస్ లక్ష్మణ్, హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే లక్ష్మణ్ మాత్రం ఎన్‌సీఏలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నాడట..

36
Rahul Dravid-Rohit Sharma

ఆసియా కప్ 2023 టోర్నీ వారం రోజుల ముందు బెంగళూరులోని ఎన్‌సీఏలో భారత జట్టు, బీసీసీఐ నిర్వహించే క్యాంపులో పాల్గొనబోతోంది. ఈ క్యాంపులో రాహుల్ ద్రావిడ్‌తో పాటు వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఉండి, భారత ప్లేయర్ల ట్రైయినింగ్‌ని క్షుణ్ణంగా పరిశీలించబోతున్నారు..

46
Jasprit Bumrah

వెస్టిండీస్ టూర్, ఆగస్టు 13న జరిగే ఐదో టీ20 మ్యాచ్‌తో ముగుస్తుంది. అదే రోజు ఐర్లాండ్ టూర్‌కి పయనమయ్యే భారత జట్టు, ఆగస్టు 18న తొలి టీ20, ఆగస్టు 20న రెండో టీ20, ఆగస్టు 23న మూడో టీ20 మ్యాచ్‌లు ఆడే స్వదేశానికి తిరిగి వస్తుంది..

56
Jasprit Bumrah

స్వదేశంలో బెంగళూరులో ఎన్‌సీఏ క్యాంపులో పాల్గొని, ఆగస్టు 29న శ్రీలంకకు పయనమవుతుంది. ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 2న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ 2023 టోర్నీ ముగిసిన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి, ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది భారత జట్టు..

66
Virat Kohli and Rohit Sharma

ఇదే సమయంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో మరో భారత పురుషుల జట్టు, ఆసియా క్రీడల కోసం చైనాకి వెళ్తుంది. ఈ టీమ్‌కి వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. అంటే రెండు నెలల గ్యాప్‌లో నలుగురు కెప్టెన్లు, ముగ్గురు హెడ్ కోచ్‌ల కెప్టెన్సీలో మ్యాచులు ఆడనుంది టీమిండియా..

click me!

Recommended Stories