ఆ ఇద్దరితోనే అసలు సమస్య... ఐపీఎల్‌లో అదరగొడితేనే, టీ20 వరల్డ్‌కప్‌లో చోటు... లేదంటే!

First Published Sep 16, 2021, 2:05 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టుపై ఇప్పటిదాకా పెద్దగా ఎలాంటి విమర్శలు రాలేదు. ఉన్నంతలో మంచి జట్టునే ఎంపిక చేశారనే కితాబు కూడా దక్కింది. అయితే ఇద్దరు ప్లేయర్ల ఎంపికపై మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో పేస్ ఆల్‌రౌండర్‌గా హార్ధిక్ పాండ్యాకి చోటు దక్కింది... అయితే అతని ఫామ్ ఈ మధ్యకాలంలో ఏ మాత్రం సరిగా లేదు...

ఆస్ట్రేలియా టూర్‌లో టీ20 సిరీస్‌లో బ్యాటుతో ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా... ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు...

అయితే ఆ తర్వాత అతని పర్ఫామెన్స్ ఏ మాత్రం సరిగా లేదు. ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే, టీ20 సిరీసుల్లో వెన్నునొప్పి కారణంగా బౌలింగ్ చేయలేకపోయాడు హార్ధిక్ పాండ్యా...

ఆ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 1లోనూ పాండ్యా బ్యాటు నుంచి కానీ, బాల్ నుంచి కానీ మెరుపులు మెరవలేదు... పాండ్యా ఫెయిల్యూర్ కూడా ముంబైని బాగా ఇబ్బందిపెట్టింది...

శ్రీలంక టూర్‌లో కూడా హార్ధిక్ పాండ్యా బ్యాట్స్‌మెన్‌గా విఫలమయ్యాడు. రెండో వన్డేలో డకౌట్ అయిన హార్ధిక్ పాండ్యా, మూడో వన్డే, మొదటి టీ20ల్లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు...

టీ20 వరల్డ్‌కప్‌లో చోటు దక్కించుకున్న హార్ధిక్ పాండ్యా, ఆ ప్లేస్‌ను ఎలాంటి పోటీ లేకుండా ఫిక్స్ చేసుకోవాలంటే మాత్రం ఐపీఎల్ ఫేజ్ 2లో తన సత్తా మరోసారి నిరూపించుకోవాల్సిందే...

లేదంటే అతనికి శార్దూల్ ఠాకూర్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకావచ్చు. టీమిండియా తరుపున గత 9 టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా ఉన్న శార్దూల్... స్టాండ్ బై ప్లేయర్‌గా మాత్రమే ఎంపికయ్యాడు...

వరుణ్ చక్రవర్తి, 2020 ఐపీఎల్ సీజన్‌లో యూఏఈలో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి... సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు... అయితే ఆ తర్వాత వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు వరుణ్...

ఐపీఎల్ 2020 ఫేజ్ 1 వాయిదా పడడానికి ప్రధాన కారణంగా నిలిచిన వరుణ్ చక్రవర్తి, టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో లక్కీగా ప్లేస్ దక్కించుకున్నాడు...

శ్రీలంకతో జరిగిన సిరీస్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన వరుణ్ చక్రవర్తి... ఐపీఎల్ ద్వారా వచ్చిన ‘మిస్టరీ స్పిన్నర్’ అనే పేరుకి న్యాయం చేయలేకపోయాడు... 

దీంతో టీ20 వరల్డ్‌కప్‌లో అతని ప్లేస్ ఫిక్స్ కావాలంటే మాత్రం, ఐపీఎల్ ఫేజ్ 2లో మరోసారి సత్తా చాటాల్సి ఉంటుంది. లేదంటే యజ్వేంద్ర చాహాల్, వరుణ్ చక్రవర్తి కంటే మెరుగైన పర్ఫామెన్స్ ఇస్తే... చాహాల్‌కి టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కొచ్చు...

click me!