వాళ్లు నటరాజన్‌కి బౌన్సర్లు వేశారు, మేం కూడా అదే స్ట్రాటెజీ ఫాలో అయ్యాం... శార్దూల్ ఠాకూర్ కామెంట్స్...

First Published Sep 16, 2021, 1:12 PM IST

ఆస్ట్రేలియా టూర్‌లో రీఎంట్రీ ఇచ్చి, ఇంగ్లాండ్ టూర్‌లో స్టార్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు శార్దూల్ ఠాకూర్. లార్డ్స్ టెస్టులో, ది ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టులో బ్యాటుతో, బాల్‌తో అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్, ఐపీఎల్ ఫేజ్ 2కి ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

ఇంగ్లాండ్ టూర్‌లో భారత బ్యాట్స్‌మెన్ రాణించిన దానికంటే, ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శనే అందర్నీ విస్తుపోయేలా చేసింది... లార్డ్స్ టెస్టులో బుమ్రా, షమీ బ్యాటుతో అదరగొడితే... నాలుగో టెస్టులో శార్దూల్ ఠాకూర్ మెరుపులు మెరిపించాడు...

రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 100+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్... కీలక సమయంలో వికెట్లు పడగొట్టి ఓవల్ టెస్టులో మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు...

‘లార్డ్స్ టెస్టులో జేమ్స్ అండర్సన్‌ని బౌన్సర్లు వేయడాన్ని పెద్ద ఇష్యూగా చేశారు. మేం ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నప్పుడు గబ్బా టెస్టులో మా టెయిలెండర్లు, ఆసీస్ బౌన్సర్లు ఎదుర్కొన్నారు...

‘లార్డ్స్ టెస్టులో జేమ్స్ అండర్సన్‌ని బౌన్సర్లు వేయడాన్ని పెద్ద ఇష్యూగా చేశారు. మేం ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నప్పుడు గబ్బా టెస్టులో మా టెయిలెండర్లు, ఆసీస్ బౌన్సర్లు ఎదుర్కొన్నారు...

మరి మాకు అవకాశం వచ్చినప్పుడు ఏం ఎందుకు బౌన్సర్లు వేయకూడదు. నట్టూతో పోలిస్తే అండర్సన్‌కి 160 టెస్టులు ఆడిన అనుభవం ఉంది... 

మేం ఎవరిపైనా సానుభూతి చూపించాలని ఆడడం లేదు, ఎవరి మెప్పు కోరుకోవడం లేదు. క్రీజులోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి బౌలర్ ఎలాంటి బంతులు వేసినా ఆడడానికి సిద్ధంగా ఉండాలి...

అంతేకానీ బౌలర్, తనకి ఎలాంటి బంతులు వేయాలో బ్యాట్స్‌మెన్ డిసైడ్ చేయకూడదు. నాకు బ్యాటింగ్ రాదు, మెల్లిగా వెయ్యి అనడానికి ఇది స్ట్రీట్ క్రికెట్ కాదు కదా...’ అంటూ కామెంట్ చేశాడు శార్దూల్ ఠాకూర్...

‘నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే మీమ్స్‌ని చదువుతూ ఉంటా. నేను వాటిని బాగా ఎంజాయ్ చేస్తా... టెస్టుల్లోకి వచ్చాక నాపై అమితమైన ప్రేమ చూపిస్తున్నారు...

నేను ఇంకా నా లక్ష్యాన్ని అందుకోలేదు. దాన్ని చేరుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నా.. జనాల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా స్థానం సంపాదించుకోవడమే నా లక్ష్యం... భారత క్రికెట్‌లో అలాంటి ముద్ర వేయాలనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు శార్దూల్ ఠాకూర్...

click me!