ఆ ముగ్గురూ ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపికైపోయారు... హర్భజన్ సింగ్ కామెంట్...

First Published Jul 20, 2021, 3:02 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ కోసం ప్లేయర్లను పరీక్షించేందుకు శ్రీలంక, భారత్ మధ్య సిరీస్‌ను ఉపయోగిస్తోంది బీసీసీఐ. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే భారత యువ ఆటగాళ్లు, వన్డేను కూడా టీ20 స్టైల్‌లో ఆడారు...

మొదటి ఓవర్ రెండో బంతి నుంచి బౌండరీలతో విరుచుకుపడిన పృథ్వీషా, తొలి బంతికే సిక్సర్ బాదిన ఇషాన్ కిషన్... ఆఖర్లో వచ్చినా అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్... ఈ ముగ్గురూ టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపికైపోయారంటూ కామెంట్ చేశాడు భారత క్రికెటర్ హర్భజన్ సింగ్.
undefined
‘ఏ ప్లేయర్‌ని అయినా అతని పర్ఫామెన్స్ ఆధారంగా జడ్జ్ చేయవచ్చు. పృథ్వీషా, ఇషాన్ కిషన్ ఆడిన విధానం చూసినవాళ్లెవ్వరైనా... ఈ ఇద్దరూ టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలని అనుకుంటారు...
undefined
విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్‌కప్‌ను గెలవాలని భావిస్తే, అతని టీమ్‌లో ఇలాంటి ప్లేయర్లు ఉండాలి. వీళ్లు ప్రత్యర్థి బౌలింగ్ ఎలా ఉందని కూడా పట్టించుకోరు...
undefined
వారి సహజమైన శైలిలో ఆడుతూ, మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తారు. పృథ్వీషా, ఇషాన్ కిషన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్‌లాంటి ప్లేయర్‌ను పక్కనబెట్టలేం...
undefined
జట్టులో ఏ సీనియర్ ప్లేయర్‌ని అయినా రిప్లేస్ చేయాలని సెలక్టర్లు భావిస్తే, దానికి కూడా సూర్యకుమార్ యాదవ్ కరెక్టుగా సూట్ అవుతున్నాడు...
undefined
నాకు తెలిసి ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్, టీ20 వరల్డ్‌కప్ జట్టుకి ఎంపికైపోయాడు. అతను అటాకింగ్ ప్లేయర్ మాత్రమే కాదు, వికెట్ కాపాడుకుంటూ, స్కోరు బోర్డును పరుగులు పెట్టించగల సమర్థుడు...
undefined
సూర్యలాంటి ప్లేయర్లు చాలా అరుదుగా ఉంటారు. వందో మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్ ఎలా, కాన్ఫిడెన్స్‌తో బ్యాటింగ్ చేస్తాడో, సూర్యకుమార్ యాదవ్‌ బ్యాటింగ్ అలా ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.
undefined
click me!