ఆ కారణంగానే రోహిత్‌ను కాదని, 2011 వరల్డ్‌కప్‌‌లో కోహ్లీని ఆడించాం... - యువరాజ్ సింగ్..

First Published Jul 19, 2021, 4:39 PM IST

విరాట్ కోహ్లీ కంటే ముందు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ. అయితే 2011 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. విరాట్ కోహ్లీ ఆ టోర్నీలో కీలక సభ్యుడిగా మారాడు. దీనికి కారణమేంటో చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.

2008 అండర్19 వరల్డ్‌కప్ గెలిచిన విరాట్ కోహ్లీ, ఆ టోర్నీ తర్వాత నేరుగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అటు ఐపీఎల్‌లో, ఇటు భారత జట్టులో అద్భతంగా రాణించి, కీలక సభ్యుడిగా మారిపోయాడు...
undefined
19 ఏళ్ల వయసులో జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, 22 ఏళ్ల వయసులో 2011 వన్డే వరల్డ్‌కప్ జట్టులో సభ్యుడిగా మెగా టోర్నీలో పాల్గొన్నాడు...
undefined
సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ వంటి ఎందరో క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్న విరాట్ కోహ్లీ, ప్రస్తుత తరంలో ఓ లెజెండరీ క్రికెటర్...
undefined
‘టీమిండియాలోకి వచ్చినప్పుడే క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు ఉండాలని గొప్ప సంకల్పంతో వచ్చాడు విరాట్ కోహ్లీ. దాన్ని నిజం చేసేందుకు అన్ని విధాలా కృషి చేశాడు...
undefined
2011 వరల్డ్‌కప్‌లో మిడిల్ ఆర్డర్‌లో పరుగులు చేసేందుకు ఓ బ్యాట్స్‌మెన్ కావాలి. అప్పటికి విరాట్ వయసు 22 ఏళ్లే. అప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య పోటీ వచ్చింది...
undefined
ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలన్నప్పుడు అప్పటికే ధారాళంగా పరుగులు చేస్తున్న కోహ్లీకే ఓటు వేశారు అందరూ. విరాట్‌కి వన్డే వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది. అప్పటితో పోలిస్తే అతనిలో చాలా మార్పు వచ్చింది...
undefined
ఏళ్లు గడిచేకొద్దీ విరాట్ కోహ్లీ ఓ రన్‌మెషిన్‌లా మారాడు. అతను ఓ టీనేజ్ యువకుడిగా జట్టులో వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను. కోహ్లీ చాలా కష్టపడతాడు.
undefined
డైట్ విషయంలో చాలా పక్కగా ఉంటాడు. ట్రైయినింగ్ ఎప్పుడూ మిస్ కాడు. అతను పరుగులు చేయడం మొదలెడితే, వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్‌‌ కావాలనే తపన, తాపత్రయం ఉన్న కుర్రాడిలా కనిపిస్తాడు...
undefined
అతనిలో ఓ సెపరేట్ యాటిట్యూడ్ ఉంది, ఓ స్పెషల్ స్టైల్ ఉంది. అతను టన్నుల కొద్దీ పరుగులు చేస్తూ వైస్ కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ అయ్యాడు...
undefined
కెప్టెన్ అయ్యాక చాలామంది పరుగులు చేయడానికి ఇబ్బంది పడతారు. కానీ కెప్టెన్ అయ్యాక కోహ్లీ మరింత మెరుగ్గా రాణించాడు...
undefined
ఇప్పుడు అతను 30ల్లో ఉన్నాడు. ఇప్పటికే కోహ్లీ ఎంతో సాధించాడు. ఓ యంగ్ క్రికెటర్‌, లెజెండరీ బ్యాట్స్‌మెన్‌గా మారే క్రమాన్ని నేను కళ్లారా చూశాను...
undefined
సాధారణంగా క్రికెటర్లు రిటైర్ అయ్యాకే లెజెండ్స్‌గా మారతారు. కానీ కోహ్లీ ఇప్పటికే ఆ స్థాయికి చేరుకున్నాడు.. అతను ఇదే రేంజ్‌లో తన కెరీర్‌ను ముగిస్తాడని అనుకుంటున్నా. అతని దగ్గర ఇంకా చాలా టైం ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు యువరాజ్ సింగ్...
undefined
2011 వన్డే వరల్డ్‌కప్‌లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసిన విరాట్ కోహ్లీ, 9 ఇన్నింగ్స్‌ల్లో 282 పరుగులు చేశాడు. సచిన్ 482, గౌతమ్ గంభీర్ 393, వీరేంద్ర సెహ్వాగ్ 380, యువరాజ్ సింగ్ 362 పరుగుల తర్వాత ఆ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు కోహ్లీ...
undefined
2011 వన్డే వరల్డ్‌కప్‌ ఆడిన 15 మంది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్ శర్మ, 2019 వన్డే వరల్డ్‌కప్‌లో వరుసగా ఐదు సెంచరీలు బాది రికార్డు క్రియేట్ చేయడం విశేషం.
undefined
click me!