అంత‌ర్జాతీయ క్రికెట్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన టాప్-10 భారత బౌల‌ర్లు వీరే

First Published | Sep 20, 2024, 6:32 PM IST

most wickets Indian bowlers : టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు తీసిన మ‌రో భార‌త బౌల‌ర్ గా ఘ‌న‌త సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చెన్నై టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు బుమ్రా ఈ రికార్డును అందుకున్నాడు. మ‌రి భార‌త క్రికెట్ లో 400ల‌కు పైగా వికెట్లు తీసిన టాప్-10 బౌల‌ర్లు ఎవ‌రు? 
 

Zaheer Khan, Anil Kumble, Jasprit Bumrah

most wickets Indian bowlers : చెన్నైలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు టీ ఆఫ్‌లో హసన్ మహ్మద్‌ను అవుట్ చేయడం తో అంత‌ర్జాతీయ క్రికెట్ లో జస్ప్రీత్ బుమ్రా మ‌రో  ఘనత సాధించాడు. తొలి రోజు బ్యాట్‌తో ప్రశంసనీయమైన పోరాటం తర్వాత.. రెండో రోజు బాల్ తోనూ అద్భుతం చేసింది భార‌త్. బంగ్లాదేశ్ ను పెద్ద‌గా ప‌రుగులు చేయ‌నీయకుండా అడ్డుకుంది.

తొలి ఇన్నింగ్స్ ను భార‌త్ 376-10 ప‌రుగుల‌తో ముగించింది. అద్భుత‌మైన బౌలింగ్ తో బంగ్లాదేశ్ ను కేవ‌లం 149 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసింది. భార‌త స్టార్ పేస‌ర్ బుమ్రా నాలుగు వికెట్లు తీసుకుని బంగ్లాదేశ్ ను దెబ్బ‌కొట్టాడు. ఈ క్రమంలో బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 

హ‌స‌న్ మహ్మద్ వికెట్ టెస్ట్ ఫార్మాట్‌లో బుమ్రాకు 162వ వికెట్. మొత్తంగా త‌న క్రికెట్ కెరీర్ లో 400 వికెట్. బుమ్రా వన్డే క్రికెట్ ఫార్మాట్‌లో 149 వికెట్లు, టీ20 ఫార్మాట్ లో 89 వికెట్లు తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన 10వ భారతీయ బౌలర్‌గా నిలిచాడు.


అత‌ర్జాతీయ క్రికెట్ లో భార‌త్ త‌ర‌ఫున అంత్య‌ధిక వికెట్లు తీసిన టాప్-10 బౌల‌ర్ల‌లో స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అత‌ను టెస్టుల్లో 619 వికెట్లతో మొత్తంగా సహా 953 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.  టెస్టు క్రికెట్ లో కుంబ్లే 619 వికెట్లు, వ‌న్డే క్రికెట్ లో 337 వికెట్లు తీసుకున్నాడు. 

ఆ త‌ర్వాత భార‌త‌ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. అశ్విన్ టెస్ట్‌లలో 516 వికెట్లతో సహా మొత్తంగా 744 వికెట్లు సాధించాడు. అశ్విన్ టెస్టు క్రికెట్ లో 516 వికెట్లు తీసుకోగా, ఇందులో 36 సార్లు 5 వికెట్లు, 8 సార్లు 10 వికెట్లు తీశాడు. వ‌న్డే క్రికెట్ లో 156 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్ లో 156 వికెట్లు తీసుకున్నాడు. 

అంత‌ర్జాతీయ క్రికెట్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన టాప్-10 భార‌త బౌల‌ర్ల‌లో ఆఫ్ స్పిన్ బౌలింగ్ దిగ్గ‌జం హర్భజన్ సింగ్ మూడో స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో 417తో సహా మొత్తం 707 వికెట్లు తీసుకున్నాడు. భ‌జ్జీ టెస్టు క్రికెట్ లో 417 వికెట్లు తీసుకోగా ఇందులో 25 సార్లు 5 వికెట్లు తీసుకున్నాడు. ఐదు సార్లు 10 వికెట్లు సాధించాడు. ఇక వ‌న్డే ఫార్మాట్ లో 269 వికెట్లు, టీ20 క్రికెట్ లో 25 వికెట్లు తీసుకున్నాడు. 

మొదటి మూడు స్థానాలు స్పిన్నర్లు ఆక్రమించగా, నాలుగో స్థానంలో భారత సీమర్, లెజెండ‌రీ ప్లేయ‌ర్ క‌పిల్ దేవ్ ఉన్నాడు. అత్యధిక వికెట్లు తీసిన భారత మాజీ కెప్టెన్ 687 స్కాల్ప్‌లతో సహా టెస్టుల్లో 434 వికెట్లు తీసుకున్నాడు. అతని రిటైర్మెంట్ సమయంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్ గా ఉన్నాడు. 

అంత‌ర్జాతీయ క్రికెట్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన టాప్-10 భార‌త బౌల‌ర్ల‌లో స్వింగ్ బౌలింగ్ కింగ్  జహీర్ ఖాన్ (597) ఐదో స్థానంలో ఉన్నాడు. జ‌హీర్ టెస్టు క్రికెట్ లో 311 వికెట్లు తీసుకున్నాడు. అలాగే వ‌న్డేల్లో 269 వికెట్లు, టీ20 క్రికెట్ లో 25 వికెట్లు తీసుకున్నాడు.  టెస్టు క్రికెట్ లో 25 సార్లు ఐదు వికెట్లు, 5 సార్లు 10 వికెట్లు తీసుకున్నాడు. 

ఆరో స్థానంలో టీమిండియా ప్ర‌స్తుత స్టార్ ఆల్ రౌండ‌ర్, స్పిన్న‌ర్ రవీంద్ర జడేజా (570) ఉన్నాడు. జ‌డేజా ఇప్ప‌టివ‌ర‌కు త‌న కెరీర్ లో మొత్తంగా 570 వికెట్లు తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ లో 294 వికెట్లు, వ‌న్డే క్రికెట్ లో 220 వికెట్లు తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ లో 13 సార్లు 5 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, 2 సార్లు 10 వికెట్లు తీసుకున్నాడు.  

భార‌త అత్యంత వేగవంతమైన బౌలర్ గా గుర్తింపు పొందిన జవగల్ శ్రీనాథ్ ఈ లిస్టులో 7వ స్థానంలో ఉన్నాడు. భారత పేస్ బౌలింగ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సాధించాడు. అత‌ను టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించే స‌మ‌యానికి టెస్టు వికెట్ల‌ల‌లో కపిల్ దేవ్ త‌ర్వాత అత్య‌ధిక వికెట్లు తీసిన రెండో బౌల‌ర్ గా శ్రీనాథ్ ఉన్నాడు. మొత్తంగా అంత‌ర్జాతీ క్రికెట్ లో జవగళ్ శ్రీనాథ్ 551 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో 236 టెస్టు వికెట్లు, 315 వ‌న్డే వికెట్లు ఉన్నాయి. 

అంత‌ర్జాతీ క్రికెట్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన టాప్-10 భార‌త బౌల‌ర్ల‌లో మహ్మద్ షమీ (448) 8వ స్థానంలో ఉన్నాడు. ష‌మీ టెస్టు క్రికెట్ లో 229 వికెట్లు, వ‌న్డేల్లో 195 వికెట్లు, టీ20 క్రికెట్ లో 25 వికెట్లు తీసుకున్నాడు. మ‌హ్మ‌ద్ ష‌మీ త‌ర్వాత స్టార్ బౌల‌ర్ ఇషాంత్ శర్మ (434) 9వ స్థానంలో ఉన్నాడు. ఇషాంత్ శ‌ర్మ టెస్టు క్రికెట్ లో 311 వికెట్లు తీసుకున్నాడు. వ‌న్డే క్రికెట్ లో 115 వికెట్లు, టీ20 క్రికెట్ లో 8 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ ప్ర‌త్యేక క్ల‌బ్ లోకి ఇప్పుడు జ‌స్ప్రీత్ బుమ్రా కూడా వ‌చ్చి చేరాడు. బుమ్రా అహ్మద్ వికెట్ ను తీసుకోవ‌డంతో అంత‌ర్జాతీయ క్రికెట్ లో అత్య‌ధిక వికెట్లు తీసుకున్న టాప్-10 భార‌త బౌల‌ర్ల‌లో చోటు సంపాదించాడు.

Latest Videos

click me!