T20 World Cup 2024లో భారత్, ఆస్ట్రేలియాలతో పాటు సూపర్-8కు చేరిన జట్లు ఇవే

First Published | Jun 15, 2024, 9:39 AM IST

T20 World Cup 2024 Super-8: టీ20 ప్రపంచ కప్ 2024లో లీగ్ దశ మ్యాచ్ లు దాదాపు ముగియడానికి వచ్చాయి. ఈ క్రమంలోనే సూపర్ 8 షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించింది. సూపర్-8 లో మొత్తం 8 జ‌ట్లు త‌ల‌ప‌డ‌నుండ‌గా, వీటిని 2 గ్రూపులుగా విభ‌జించారు. 
 

T20 World Cup 2024

T20 World Cup 2024 Super-8: టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024లో ఇప్ప‌టికే అనేక సంచ‌ల‌నాలు న‌మోద‌య్యాయి.  బ‌ల‌మైన జ‌ట్లుగా గుర్తింపు ఉన్న టీమ్స్ సైతం ఎలిమినేట్ గాకా, ఎవ‌రూ కూడా ఊహించ‌ని విధంగా అమెరికా సూప‌ర్-8 చేర‌కుని చ‌రిత్ర సృష్టించింది. క్రికెట్ ను మ‌రింత విస్త‌రించాల‌నే ల‌క్ష్యంతో ఐసీసీ ఈ సారి వెస్టిండీస్ తో పాటు అమెరికాలో వేదిక‌లుగా టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ను నిర్వ‌హిస్తోంది. 

త‌మ స్వ‌దేశంలో జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో అమెరికా స‌త్తా  చాటుతూ  సూప‌ర్-8 చేరింది. గ్రూప్ ఏ నుంచి భారత్, అమెరికాలు సూప‌ర్ 8 కు చేరుకున్నాయి. పాకిస్తాన్, కెన‌డా, ఐర్లాండ్ జ‌ట్లు ఎలిమినేట్ అయ్యాయి. 


మొద‌టిసారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడుతున్న అమెరికా జ‌ట్టు చ‌రిత్ర సృష్టిస్తూ సూప‌ర్-8 అర్హ‌త సాధించింది. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో ఐర్లాండ్‌తో జరిగిన చివరి గ్రూప్ ఏ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డంతో యూఎస్ఏ టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో లీగ్ ద‌శ‌లో 5 పాయింట్లు సాధించి సూప‌ర్-8కు అర్హ‌త సాధించింది. దీంతో పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది. 

ఇక గ్రూప్ బీలో ఆస్ట్రేలియా, స్కాంట్లాండ్, ఇంగ్లాండ్, న‌మీబియా, ఒమ‌న్ జ‌ట్లు ఉన్నాయి. వ‌రుస‌గా ఆస్ట్రేలియా 3 విజ‌యాల‌తో 6 పాయింట్లు సాధించి గ్రూప్ బీ నుంచి సూప‌ర్-8 కు అర్హ‌త సాధించింది. మ‌రో ప్లేస్ కోసం స్కాట్లాండ్, ఇంగ్లాండ్ జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. త‌దుప‌రి మ్యాచ్ లో స్కాంట్లాండ్ ఓడిపోతే ఎలిమినేట్ అవుతుంది. అయితే, ఇంగ్లాండ్ గెలిస్తేనే సూప‌ర్-8కు చేరుతుంది. లేకుండా ఆ స్థానంలో స్కాంట్లాండ్ చేరుతుంది. ప్ర‌స్తుతం చెరో మూడు మ్యాచ్ లు ఆడ‌గా, స్కాంట్లాండ్ కు 5 పాయింట్లు, ఇంగ్లాండ్ కు 3 పాయింట్లతో ఉన్నాయి. 

గ్రూప్-సీ లో ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఉగాండా, ప‌పువా న్యూగినియా, న్యూజిలాండ్ జ‌ట్లు ఉన్నాయి. ఎవ‌రు ఊహించ‌ని విధంగా ఫేవ‌రెట్ జ‌ట్టుగా టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ రెండు మ్యాచ్ ల‌ను ఓడి గ్రూప్ సీలో చివ‌రి స్థానంతో ఎలిమినేట్ అయింది. అలాగే, ప‌పువా న్యూగినియా, ఉగాండా జ‌ట్లు కూడా ఎలిమినేట్ అయ్యాయి. అతిథ్య వెస్టిండీస్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ లు వ‌రుస‌గా మూడు మ్యాచ్ ల‌ను గెలిచి సూప‌ర్-8 కు అర్హ‌త సాధించాయి. 

గ్రూప్-డీ లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నేద‌ర్లాండ్స్, నేపాల్, శ్రీలంక జ‌ట్లు ఉన్నాయి. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు వ‌రుస‌గా మూడు మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించి 6 పాయింట్ల‌తో సూప‌ర్-8 కు అర్హ‌త సాధించింది. శ్రీలంక, నేపాల్ జ‌ట్లు ఇప్ప‌టికే ఎలిమినేట్ అయ్యాయి. గ్రూప్ సీ నుంచి సూప‌ర్-8 రెండో స్థానం కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జ‌ట్లు పోటీప‌డుతున్నాయి.

సూప‌ర్-8 లో మొత్తం 8 జ‌ట్లు, రెండు గ్రూపులు

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 సూప‌ర్-8 లో మొత్తం 8 జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జించారు. గ్రూప్-1లోకి మూడు జట్లు వచ్చాయి. ఇందులో భార‌త జ‌ట్టుతో పాటు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ లు ఉన్నాయి. గ్రూప్-2లో అతిథ్య దేశాలైన వెస్టిండీస్, అమెరికాలతో పాటు దక్షిణాఫ్రికా కూడా అర్హత సాధించింది. గ్రూప్-1లో మిగిలిన స్థానాల కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ ఇద్దరిలో ఒకరికి సూపర్-8 టిక్కెట్ లభిస్తుంది. గ్రూప్-2లో మిగిలిన ఒక స్థానం కోసం స్కాట్లాండ్, ఇంగ్లండ్ జట్లు పోటీ పడుతున్నాయి.  

జూన్ 19 నుంచి సూపర్-8 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. జూన్ 20న అఫ్గానిస్థాన్‌తో సూపర్-8లో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. 

Latest Videos

click me!