0 పరుగులు...0 వికెట్లు.. 0 క్యాచ్‌లు.. టీ20 ప్రపంచ కప్ భార‌త జట్టులోని ఈ ప్లేయర్ ఎవ‌రో తెలుసా?

First Published Jun 14, 2024, 12:02 AM IST

T20 World Cup 2024 : భారత జట్టులోని స్టార్ ఆల్ రౌండ‌ర్ ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ 2024లో ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాతో క‌లిపి 3 మ్యాచ్‌లు ఆడాడు. అయితే, విచిత్రంగా అనిపించినా ఇప్ప‌టివ‌కు ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు.. ఒక్క‌ వికెట్ కూడా తీసుకోలేకపోయాడు.. ఒక్క‌ క్యాచ్ కూడా అందుకోలేక‌పోయాడు.. ! 
 

T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024లో వ‌రుస విజ‌యాల‌తో టీమిండియా సూపర్-8 కు అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 10 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో అమెరికా పై విజయం సాధించింది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాలను ఓడించి హ్యాట్రిక్ విజయాలు సాధించింది. అయితే, ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో 3 మ్యాచ్‌లు ఆడినా ఇప్ప‌టివ‌ర‌కు ఏమీ చేయలేకపోయిన టీమిండియా ప్లేయ‌ర్ ఒక‌రున్నారు.

భారత జట్టులోని స్టార్ ఆల్ రౌండ‌ర్ ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ 2024లో ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాతో క‌లిపి 3 మ్యాచ్‌లు ఆడాడు. అయితే, విచిత్రంగా అనిపించినా ఇప్ప‌టివ‌కు ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు.. ఒక్క‌ వికెట్ కూడా తీసుకోలేకపోయాడు.. ఒక్క‌ క్యాచ్ కూడా అందుకోలేక‌పోయాడు.. ! భారత జట్టులోని ఈ ఆటగాడు మరెవరో కాదు రవీంద్ర జడేజా. 2024 టీ20 ప్రపంచకప్‌లో రవీంద్ర జడేజా ఇప్పటివరకు ఏమీ చేయలేకపోయాడు. 

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో 3 మ్యాచ్‌ల స‌మ‌యంలో రవీంద్ర జడేజాకు ఒకే ఒక్క మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. జూన్ 9న పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఖాతా తెరవకుండానే తొలి బంతికే ఔటయ్యాడు. ఐర్లాండ్, అమెరికాతో జరిగిన మ్యాచ్‌ల్లో రవీంద్ర జడేజాకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.

Rohit Sharma, Ravindra Jadeja

అదే సమయంలో, ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కూడా, టీ20 ప్రపంచ కప్ 2024లో రవీంద్ర జడేజా ఒక్క రనౌట్ లేదా ఒక్క క్యాచ్ కూడా అందుకోలేక‌పోయాడు. బుధవారం అమెరికా జరిగిన టీ20 ప్రపంచకప్ లో రవీంద్ర జడేజాకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేసే అవకాశం కెప్టెన్ రోహిత్ శర్మ ఇవ్వలేదు.

అంతకుముందు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 2 ఓవర్లు వేసి 10 పరుగులు ఇచ్చాడు. ఈ సమయంలో అతనికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 1 ఓవర్‌లో 7 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

Latest Videos

click me!