IND vs SL: టీమిండియా ఓటమికి కారణాలు ఇవే..

First Published | Aug 4, 2024, 11:39 PM IST

India vs Sri Lanka :  భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో రోహిత్ శర్మ సూపర్ హాఫ్ సెంచరీ చేయగా, వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ భారత్ జట్టు ఈ మ్యాచ్ లో ఓడిపోయింది. 
 

India vs Sri Lankam, Virat,

India vs Sri Lanka : శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 32 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. కొలంబో మైదానంలో ఆతిథ్య శ్రీలంక 240/9 స్కోరు చేసింది. 241 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో భారత జట్టు 42.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌట్ అయింది. 

టార్గెట్ ఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాకు మంచి శుభారంభం అందించాడు. రోహిత్ హాఫ్ సెంచరీ (44 బంతుల్లో 64 పరుగులు) కొట్టాడు. భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 44 పరుగుల ఇన్నింగ్స్ ఆడినా భార‌త జ‌ట్టు విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఈ మ్యాచ్ లో భార‌త్ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణాలు గ‌మ‌నిస్తే ముందుగా చెప్పుకోవాల్సి శ్రీలంక బౌలింగ్ గురించి..

Latest Videos


India , Cricket, virat kohli

ఈ మ్యాచ్ లో ఆరంభంలో కాస్త అటుఇటుగా బౌలింగ్ చేసిన శ్రీలంక రోహిత్ శ‌ర్మ‌ను ఔట్ చేసిన త‌ర్వాత రెచ్చిపోయింది. మ‌రీ ముఖ్యంగా శ్రీలంక లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లు వేసిన అతను 33 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ శ్రీలంక‌న్ బౌలింగే భార‌త్ ను దెబ్బ‌కొట్టింది. 

India , Cricket, virat kohli

భార‌త్ ఓట‌మి కార‌ణాలు గ‌మ‌నిస్తే.. శ్రీలంక బౌలింగ్ ను రోహిత్ శ‌ర్మ కూడా ఎదుర్కొన్నాడు. అత‌ను హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. అలాగే, ఆల్ రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ సైతం శ్రీలంక బౌలింగ్ ను ఎదుర్కొని 44 ప‌రుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. కానీ, మిగ‌తా భార‌త బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. 

india, cricket, Gill

అక్ష‌ర్ ప‌టేల్, రోహిత్ శ‌ర్మ మిన‌హా ఇత‌ర భార‌త బ్యాట‌ర్లు పెద్ద ఇన్నింగ్స్ లు ఆడ‌లేక‌పోయారు. గిల్ 35 పరుగులతో పరవాలేదనిపించాడు. కానీ, స్టార్ సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. ఇక శివం దూబే, కేఎల్ రాహుల్ అయితే ఖాతా కూడా తెరవలేకపోయారు. జీరో పరుగులకే ఔట్ అయ్యారు. 

india, cricket

చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 7 పరుగులు మాత్రమే చేశాడు. కీలక బ్యాటర్లు పరుగులు చేయకపోవడంతో భారత్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. వాషింగ్టన్ సుందర్ 15 పరుగులు, సిరాజ్ 4, అర్షదీప్ 3 పరుగులు చేశారు. కుల్దీప్ యాదవ్ 7 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

రోహిత్ శర్మ, అక్షర్ పటేల్ లకు తోడుగా మరో ఒక్క ప్లేయర్ మంచి ఇన్నింగ్స్ ఆడి వుంటే భారత్ విజయాన్ని అందుకునేది. తొలి వన్డేలో కూడా ఇదే జరిగింది. రోహిత్ హాఫ్ సెంచరీ కొట్టగా, మిగతా ప్లేయర్లు పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయారు. 

తొలి మ్యాచ్ టై తర్వాత రోహిత్ శర్మ బ్యాటర్లకు తమదైన తరహాలో షాట్లు ఆడకుండ కష్టపడి బ్యాటింగ్ చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కానీ, భారత బ్యాటర్లు ఇది పట్టించుకోలేదని తెలుస్తోంది. అందుకే రెండో వన్డేలో కూడా చెత్త షాట్స్ ఆడి వికెట్లు చేజార్చుకున్నారు. 

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 40 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. అనంతరం ల‌క్ష్య‌ ఛేదనలో టీమిండియా 42.2 ఓవర్లలో 208 పరుగులకే కుప్పకూలింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని 3-0తో కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా ఆ తర్వాత వన్డే సిరీస్ తొలి మ్యాచ్ ను టై గా ముగించింది. రెండో మ్యాచ్ లో ఓడిపోయింది. భార‌త ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం బ్యాటింగ్. వన్డే సిరీస్ లో శ్రీలంక 1-0తో అధిక్యంలో ఉంది. 

click me!