అంతర్జాతీయ క్రికెట్ లో రికార్డుల మోత మోగిస్తున్న రోహిత్ శ‌ర్మ

First Published | Aug 4, 2024, 10:02 PM IST

Rohit Sharma : భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అంత‌ర్జాతీయ క్రికెట్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. భార‌త లెజెండ‌రీ ప్లేయ‌ర్లు సచిన్ టెండూల్క‌ర్, రాహుల్ ద్ర‌విడ్ రికార్డుల‌ను బ్రేక్ చేయడంతో పాటు సిక్సర్లతో సరికొత్త రికార్డును కూడా నమోదుచేశాడు.
 

Rohit Sharma : ప్ర‌స్తుతం భార‌త క్రికెట్ జ‌ట్టు శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో మూడు మ్యాచ్ ల వ‌న్డే సిరీస్ ఆడుతోంది. తొలి మ్యాచ్ లో సూప‌ర్ బ్యాటింగ్ తో హాఫ్ సెంచ‌రీ కొట్టిన భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రెండో మ్యాచ్ లోనూ అద్భుతంగా రాణించాడు. 

భార‌త్-శ్రీలంక రెండో వ‌న్డేలో రోహిత్ వ‌ర్మ  64 ప‌రుగులు ఇన్నింగ్స్ ఆడాడు. త‌న ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. అంత‌కుముందు తొలి వ‌న్డేలో రోహిత్ శ‌ర్మ 58 ప‌రుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 


ఇత‌ర భారత బ్యాట‌ర్లు ప‌రుగులు చేయ‌డానికి ఇబ్బంది ప‌డుతున్నప్పటికీ భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే రోహిత్ శ‌ర్మ అనేక రికార్డులు న‌మోదుచేయ‌డంతో పాటు ప‌లు రికార్డుల‌ను బ్రేక్ చేశాడు. 

అంత‌ర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా రోహిత్ 300 సిక్సర్లు పూర్తి చేశాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఓపెనర్‌గా నిలిచాడు. హిట్‌మ్యాన్ కంటే ముందు, భారత్ తరఫున వన్డేల్లో 300 సిక్సర్లు బాదిన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ లేడు. రోహిత్ తన కెరీర్‌లో 175 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును నెలకొల్పాడు.

ഹിറ്റ്‌മാനും ടീമില്‍

అలాగే, భార‌త ఓపెన‌ర్ గా అత్య‌ధిక హాఫ్ సెంచరీలు సాధించిన ప్లేయ‌ర్ గా స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్ట్, వ‌న్డే, టీ20 క్రికెట్) అత్యధిక ఇన్నింగ్స్‌లలో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ప్లేయ‌ర్ గా రోహిత్ రికార్డు సాధించాడు. టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 120 సార్లు ఓపెనర్‌గా 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. రోహిత్ 121వ సార్లు ఓపెన‌ర్ గా 50 కంటే ఎక్కువ ప‌రుగులు చేశాడు. 

నాలుగోసారి వన్డే క్రికెట్‌లో రోహిత్ 10 ఓవర్లలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భార‌త డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డుకు చేరువ‌య్యాడు. సెహ్వాగ్ వన్డేల్లో 7 సార్లు 10 ఓవర్లలోనే ఫిఫ్టీ సాధించాడు. సచిన్ టెండూల్కర్, రాబిన్ ఉతప్ప, గౌతమ్ గంభీర్ ఒక్కోసారి హాఫ్ సెంచ‌రీ కొట్టారు.

ఓపెనర్‌గా వేగంగా 15 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ తర్వాత రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ 331 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా, హిట్‌మన్ 352 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.

భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్ రాహుల్ ద్ర‌విడ్ రికార్డును కూడా రోహిత్ శ‌ర్మ బ్రేక్ చేశాడు. వన్డే క్రికెట్‌లో భార‌త్ త‌ర‌ఫున‌ అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రాహుల్ ద్రవిడ్‌ను అధిగమించి నాలుగో ఆటగాడిగా నిలిచాడు.  రాహుల్ ద్రవిడ్ 10768 పరుగులతో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 18426 పరుగులతో మొదటి స్థానంలో, విరాట్ కోహ్లీ (13872) రెండో స్థానంలో, సౌరవ్ గంగూలీ (11221) మూడో స్థానంలో, రోహిత్ శ‌ర్మ (10,831 ప‌రుగులు) నాలుగో స్థానంలో ఉన్నారు. 

Latest Videos

click me!