IND vs SL: భారత్-శ్రీలంక మధ్య 3 వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ కొలంబో వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ తో రాణించిన శ్రీలంక విజయాన్ని అందుకుని సిరీస్‌లో 1-0తో ఆధిక్యాన్ని సాధించింది.
India vs Sri Lanka : భారత ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా తొలి ఓటమిని శ్రీలంక చేతిలో చవిచూసింది. భారత్-శ్రీలంక మధ్య 3 వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ కొలంబో వేదికగా జరిగింది.
25
ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో శ్రీలంక జట్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యాన్ని సాధించింది. ఆగస్టు 2న ఇదే మైదానంలో తొలి మ్యాచ్ టై అయింది. ఆదివారం (ఆగస్టు 4) ఆర్ ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 40 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది.
35
అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా 42.2 ఓవర్లలో 208 పరుగులకే కుప్పకూలింది. దీంతో గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. అంతకుముందు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని 3-0తో కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా ఆ తర్వాత తొలి వన్డే టై అయింది. రెండో మ్యాచ్ లో ఓడిపోయింది. భారత ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్.
45
Rohit Sharma, cricket
కెప్టెన్ రోహిత్ శర్మ తప్ప ఎవరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. హిట్ మ్యాన్ 64 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్ 44, శుభమన్ గిల్ 35 పరుగులు చేశారు. 15 పరుగుల వద్ద వాషింగ్టన్ సుందర్, 14 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔటయ్యారు. శివమ్ దూబే, కేఎల్ రాహుల్ ఖాతాలు తెరవలేదు.
55
India vs Sri Lanka
7 పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్ ఔటయ్యాడు. మహ్మద్ సిరాజ్ 4 పరుగులు, అర్ష్‌దీప్ సింగ్ 3 పరుగులు చేశారు. కుల్దీప్ యాదవ్ 7 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంక తరఫున జెఫ్రీ వాండర్సే 6 వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ ఆగస్టు 7న కొలంబోలో జరగనుంది. సిరీస్‌ను సమం చేయాలంటే భారత్ మూడో మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది.