కెప్టెన్సీ లేకున్నా రూ. కోట్లు.. కోహ్లీ ఆదాయ మార్గాలు ఇవే..!

First Published Sep 21, 2021, 11:21 AM IST

కోహ్లీకి  చాలా రకాలుగా ఆదాయం లభించనుందట. ప్రతిరోజూ కోహ్లీ రూ. కోట్లు సంపాదిస్తున్నారట. అసలు కోహ్లీ.. ఆదాయ మార్గాలేంటో ఓసారి చూద్దాం..

Virat Kohli

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వరసగా అభిమానులకు షాకిచ్చాడు. త్వరలోనే కోహ్లీ టీ20 జట్టు తోపాటు.. ఆర్సీబీ టీం  కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ వార్త విని చాలా మంది అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే.. ఈ రెండు కెప్టెన్సీలు లేకున్నా.. కోహ్లీ ఆదాయం(Virat Kohli Income) మాత్రం ఇసుమంతైనా తగ్గదని తెలుస్తోంది.

Virat Kohli

ఇవి కాకుండానే.. కోహ్లీకి  చాలా రకాలుగా ఆదాయం లభించనుందట. ప్రతిరోజూ కోహ్లీ రూ.(Kohli Income Per Day) కోట్లు సంపాదిస్తున్నారట. అసలు కోహ్లీ.. ఆదాయ మార్గాలేంటో ఓసారి చూద్దాం..(Virat Kohli Sources Of Income)

క్రికెట్ తో సంబంధం లేకుండా.. కోహ్లీ 20 సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. వాటి నుంచి కోహ్లీ రూ.150 కోట్లు సంపాదిస్తున్నాడట. కేవలం ఒక్క రోజు షూటింగ్ కి ఆయన 70 మిలియన్లకు పైగా వసూలు చేస్తారట. అతను ప్యూమా, ఆడి, MRF, టిస్సాట్, అమేజ్ బ్యాటరీ & ఇన్వర్టర్, హీరో మోటోకార్ప్, వోలిని, టూ యమ్, మాన్యవర్, బూస్ట్, అమెరికన్ టూరిస్టర్, ఉబెర్, విక్స్, ఫిలిప్స్ ఇండియా ఇలా ఎన్నో కంపెనీలకు ఆయన బ్రాండ్ గా ఉన్నారు.

విరాట్ కోహ్లీకి వ్రోగన్ అనే ఫ్యాషన్ వేర్ బ్రాండ్ కూడా ఉంది. ఈ ఫ్యాషన్ బ్రాండ్ ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ కి బ్రాండ్ గా ఉంది.
 

కోహ్లీ భార్య అనుష్క కూడా నుష్ అనే ఫ్యాషన్ లేబుల్ కలిగి ఉంది. అనుష్క , విరాట్ క్లాతింగ్ లైన్స్.. చాలా ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్లలో సులభంగా లభిస్తున్నాయి.

అనుష్క శర్మకు 'క్లీన్ స్లేట్ ఫిల్మ్స్' అనే ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. పాతాల్ లోక్ వంటి ప్రసిద్ధ వెబ్ సిరీస్‌లు , బుల్బుల్, పరి వంటి అనేక సినిమాలు ఈ సంస్థలో నిర్మించారు.


విరాట్ కోహ్లీకి ఢిల్లీలో నివా అనే పేరున్న సొంత రెస్టారెంట్ కూడా ఉంది. అతను ఈ రెస్టారెంట్‌ను చాలా విలాసవంతమైన రీతిలో నిర్మించాడు, దీని కారణంగా విరాట్ కోహ్లీ సంవత్సరానికి రూ. 9 కోట్లకు పైగా సంపాదిస్తున్నాడు.

విరాట్ కోహ్లీ  ఉలి ఫిట్‌నెస్ సెంటర్‌లో రూ .90 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఈ ఫిట్‌నెస్ సెంటర్‌కు దేశవ్యాప్తంగా అనేక శాఖలు ఉన్నాయి.

కోహ్లీ FC గోవాలో ఫుట్‌బాల్ జట్టు యజమాని గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇది కాకుండా, అతను UAE రాయల్స్‌లోని టెన్నిస్ టీం, బెంగళూరు వారియర్స్‌లో రెజ్లింగ్ టీమ్ , లండన్‌కు చెందిన స్పోర్ట్స్ టెక్ స్టార్ట్ అప్ అయిన స్పోర్ట్స్ కాన్వో నుండి కూడా చాలా సంపాదిస్తాడు.
 

విరాట్ కోహ్లీ  సోషల్ మీడియా ద్వారా కోట్లు సంపాదిస్తాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి  150 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతను స్పాన్సర్డ్  పోస్ట్ కోసం రూ. 5 కోట్లు వసూలు చేస్తాడు.

click me!